Begin typing your search above and press return to search.

తెలుగు తేజం నాటులో ఘాటు

By:  Tupaki Desk   |   29 Nov 2016 1:54 PM GMT
తెలుగు తేజం నాటులో ఘాటు
X
తెలుగమ్మాయి తేజస్వి మదివాడ చాలా కాలంగా తనకు బ్రేక్ నిచ్చే మూవీ కోసం ఎదురుచూస్తోంది. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా.. తనకు వచ్చిన అన్ని ఆఫర్లను యాక్సెప్ట్ చేసేసి అదృష్టం పరీక్షించుకుంటూనే ఉంది. ఒక వైపు హీరోయిన్ గా చేస్తూ.. మరోవైపు చిన్న చిన్న పాత్రలను కూడా చేయగలగడం తేజస్వికే చెల్లింది.

బాలీవుడ్ మూవీ హంటర్ రీమేక్ లో నటిస్తున్న తేజస్వి.. ఆ అడల్ట్ కామెడీ మూవీలో హాటు అందాలను చూపించబోతోందని అంటున్నారు. మరోవైపు దానికి ముందర ట్రైలర్ మాదిరిగా.. మరో సినిమాలు హాట్ హాట్ గా కనిపించనుంది. 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'మూవీలో హేభా పటేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరో కీలక పాత్రలో తేజస్వి మదివాడ కనిపించనుంది. ఇందులో ఈమెకు ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. తేజస్వి ఆన్ స్క్రీన్ పై తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ ని చూపించే ఛాన్స్ ఈ సినిమాతోనే అని చెప్పాలి. అందుకే తన ఆనందాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. అభిమానులకు పంచేసింది. నాభి కిందకు కట్టిన లంగా జాకెట్ తో.. స్లీవ్ లెస్ జాకెట్ తో.. ఈ తెలుగు నారి తళతళలాడిపోతోంది.

చూసేందుకు నాటు రూపమే అందులో.. అందులో ఘాటు అందాలతో హీటు పెంచేస్తోంది తేజస్వి. ఈ పాటలో హాటు హాటు డ్యాన్సులు కూడా వేస్తోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ లో రూపొందే హంటర్ రీమేక్ సోగ్గాడుతో.. తాను పెద్ద హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోతానని నమ్మకంగా ఉంది తేజస్వి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/