Begin typing your search above and press return to search.

లీక్ ఈసారీ నిజ‌మైంది.. తేజ‌స్వీ అవుట్‌

By:  Tupaki Desk   |   23 July 2018 4:37 AM GMT
లీక్ ఈసారీ నిజ‌మైంది.. తేజ‌స్వీ అవుట్‌
X
కోట్లాది రూపాయిల ఖ‌ర్చుతో అత్యంత ఆర్భాటంగా.. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన బిగ్ బాస్ షోకు లీకుల పోటు త‌ప్ప‌టం లేదు. ప్ర‌తి వారాంతంలో ఎలిమినేష‌న్ ఉండ‌టం.. అందులో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న విష‌యం రెండు రోజుల ముందే సోష‌ల్ మీడియాలో వ‌చ్చేయ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే తూచా త‌ప్ప‌కుండా అన్న‌ట్లు జ‌రుగుతోంది.

గ‌త వారం మాదిరి ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న విష‌యం శుక్ర‌వారం రాత్రికే సోష‌ల్ మీడియాలో వ‌చ్చేసింది. శ‌నివారం ఆ ప్ర‌చారం మ‌రింత పెరిగింది. దీనికి త‌గ్గ‌ట్లే ఆదివారం రాత్రి ప్ర‌క‌టించిన ఎలిమినేష‌న్ కార్య్ర‌మంలో సినీ న‌టి తేజ‌స్వి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ కు సంబంధించి స‌స్పెన్స్ మొయింటైన్ చేస్తున్న‌ప్ప‌టికీ.. అనూహ్యంగా ఎవ‌రు ఎగ్జిట్ అవుతార‌న్న విష‌యం మాత్రం రెండో వారం కూడా బ‌య‌ట‌కు పొక్క‌టం గ‌మ‌నార్హం. ఈ వారం ఎలిమినేష‌న్ లో ప్ర‌త్యేక‌త ఏమంటే.. హౌస్ నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌న్న బాధ్య‌త‌ను ల‌క్ష్మీ మంచుకు అప్ప‌జెప్పారు. వైఫ్ ఆఫ్ రామ్ ప్ర‌మోష‌న్లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట‌రైన ఆమె.. హౌస్ మేట్స్ తో సంద‌డి చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆమెకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. నాని బిగ్ బాస్ ఇంట్లో స‌భ్యుల మాదిరి ఇమిటేట్ చేస్తుంటే.. ల‌క్ష్మీ మంచు గుర్తు ప‌ట్టాలి. ఈ టాస్క్ లో అంద‌రిని ఆమె గుర్తు ప‌ట్టారు. దీంతో.. సామాన్యులే కాదు.. ప్ర‌ముఖులు సైతం బిగ్ బాస్ కార్య‌క్ర‌మాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా చూస్తున్నార‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. మొత్తానికి బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి భారీ ఆద‌ర‌ణ ఉంద‌న్న విష‌యాన్ని ఏ సంద‌ర్భంలోనూ మిస్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న టీం ఐడియా బాగానే ఉంది కానీ.. ఎలిమినేష‌న్ ముచ్చ‌ట అంత ఈజీగా ఎలా బ‌య‌ట‌కు పొక్కుతున్న‌ట్లు..?