Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరినీ లెస్బియన్ అనేశారు

By:  Tupaki Desk   |   12 July 2017 7:36 AM GMT
ఆ ఇద్దరినీ లెస్బియన్ అనేశారు
X
తెలుగుమ్మాయ్ తేజస్వి మదివాడ.. సోషల్ మీడియాలో రకరకాలుగా గింగిరాలు తిరుగుతుంది. సినిమాలు ఏమి ఎక్కువగా చేయకపోయినా.. చేసిన కొన్ని సినిమాలలో కూడా లీడ్ రోల్ కాకపోయినా తన హాట్ ఫిగర్ తో యూత్ ను మాత్రం తన వైపు తిప్పుకుంది. ఆ మధ్య ఒక ఫోటో షూట్ చేసి బాగా పాపులర్ అయింది. ఇలా ఆమె ఫోటోలు పెడితే పర్వాలేదు కానీ ..ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఉన్నట్లు పెడితే మన వాళ్ళు ఊరికే ఎందుకు ఉంటారు.. అసలే తింగరోళ్లుగా!!

తేజస్వి కొన్ని రోజుల కిందట తన స్వీమింగ్ చేస్తూ స్వీమింగ్ పూల్ దగ్గర ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ నటి అనిషా అంబ్రోస్ తో కలిసి స్విమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు టాగ్ లైన్ కూడా కొంచెం ఫన్నీ గానే పెట్టింది “ఈమె అందరిలాగా కాదు నేను ఎంజాయ్ చేస్తున్న దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ” అని అనిషా అంబ్రోస్ గురించి చెబుతూ ఆమెను కూడా టాగ్ చేసి పోస్ట్ చేసింది. ఆ ఫోటోల దానికి ఆదారంగా చేసి తేజస్వి పై ఎలాంటి కామెంట్లు వినపడుతున్నాయో చూడండి. వాళ్ళిద్దరి స్నేహాన్ని మరో కోణంలో జతచేశారు కొంతమంది. వాళ్ళ మధ్య ఉండేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని వాళ్ళు 'లెస్బియన్స్' అని కూడా పుకారులు లేవదీశారు. ఇదే విషయం ఈరోజు ఒక ఆంగ్ల పత్రిక ప్రకటించడంతో ఈ న్యూస్ మరింత వైరల్ అయిపోయింది.

తేజస్వి ఇటువంటి ఫోటో పోస్ట్ చేసినప్పుడే అనుకొని ఉంటుంది దీనికి చాలా విమర్శలు రావచ్చని. కానీ ఇలా ఆమెను లెస్బియన్ చేసిపారేస్తారు అని ఊహించి ఉండదు. మొత్తానికి ఈ సిల్లీ విషయానికి తేజస్వి ఏమి జవాబు చెప్పకుండా ఏది ఎక్కడ ఎలా ఎప్పుడు మాట్లాడితే కరక్టో బాగానే తెలుసుకున్నట్లుంది. ఇప్పుడు అలా వస్తున్న కామెంట్లకు చిరాకు పడకుండా తన పని తాను చేసుకుంటూపోతోంది.​