Begin typing your search above and press return to search.

'క్యూట్' కాదు 'హాట్' అంటోంది

By:  Tupaki Desk   |   3 May 2017 7:21 AM GMT
క్యూట్ కాదు హాట్ అంటోంది
X
ముద్దు ముద్దుగా మాటలాడే పిల్లగా తెలుగు తెరకు పరిచయమైన తెలుగు పిల్ల తేజస్వి మదివాడ. సాధరణంగా మన సినిమా లో మొదటిసారి ఏ పాత్ర తో ప్రేక్షకుల ముందుకు వస్తారో ఆ పాత్ర ప్రభావం కాస్త గట్టిగానే ఉంటుంది. అదే ఉచ్చులో పడింది ఈ తెలుగు పిల్ల కూడా. తెలుగు అమ్మాయీగా హీరోయిన్ కావడానికి కావలిసిన అన్ని లక్షణాలూ ఉన్నా కూడా.. చిన్న పాత్రలతో సెకండ్ హీరోయిన్ గా బండి నడిపిస్తోంది.

టాలీవుడ్ లో అంతా తనను “భలే ముద్దుగా ఉంటావే నువ్వు అంటే బాగానే ఉండేది కాని.. ఇప్పుడు నాకు వరస పెట్టి అవే పాత్రలు లేకుంటే చిన్న చిన్న ముద్దుగా ఉండే పాత్రలే వస్తున్నాయి” అంటోంది అమ్మడు. ఈ శుక్రవారం విడుదల కానున్న బాబు బాగా బిజీ సినిమా లో కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. తేజస్వి కి ఇది కాస్త ఇబ్బంది గా అనిపించి ఒక ఫోటో షూట్ తో అందరికీ షాకిచ్చింది. ఆరే ఏమి ఉందిరా ఈ పిల్ల అనేలా చేసింది. ఈ ఫోటో లో తను ఇచ్చిన సెక్సీ పోజ్లు మన వాళ్ళకి ఎంతవరుకు అందుతాయి తో చూడాలి. సదరు ఫోటోల గురించి ప్రస్తావిస్తూ.. ''అబ్బా ఇకమీదైనా నన్ను క్యూట్ అనకండే. హాట్ అనండి ప్లీజ్'' అంటూ సెలవిచ్చింది.

బాబు బాగా బిజీ హింది సినిమా రీమేకైనా తెలుగు సినిమాకు తగ్గ మార్పులతో అవసరాల శ్రీనివాస్ హీరోగా కాస్త శృంగార కామెడి నేపధ్యంలో ప్రేక్షకలు ముందుకు వస్తోంది. ఇందులో తేజస్వి పాత్ర కాస్త కొంటె పిల్లాల కనిపిస్తుంది అంటా. కాకపోతే తన పాత్రకు సంబంధించి ఒక్క స్పయిసీ సీన్ కూడా లేదట. హయ్యో పాపం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/