Begin typing your search above and press return to search.

జాంబీరెడ్డి హీరో టాప్ గేర్‌.. స్టార్ ప్రొడ్యూస‌ర్ తో మూవీ!

By:  Tupaki Desk   |   21 May 2021 7:30 AM GMT
జాంబీరెడ్డి హీరో టాప్ గేర్‌.. స్టార్ ప్రొడ్యూస‌ర్ తో మూవీ!
X
చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో న‌టించి తిరుగులేద‌ని అనిపించుకున్నాడు మాస్ట‌ర్ తేజ‌. న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత హీరోగా మారిపోయి ‘జాంబీరెడ్డి’తో అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. కమర్షియల్ సక్సెస్ తో పాటు .. ఈ డిఫ‌రెంట్ మూవీతో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ‌. మంచి ఈజ్ తో కొన‌సాగిన తేజ యాక్టింగ్ కు ఫుల్ మార్కులు ప‌డ్డాయి. దీంతో.. మేక‌ర్స్ దృష్టిలో కూడా ప‌డ్డాడు.

ప్ర‌స్తుతం తేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇంతలోనే మూడో సినిమాకు సైన్ చేయ‌డం.. అదికూడా బ‌డా బ్యాన‌ర్ కావ‌డంతో తేజ గ్రాఫ్ మ‌రో మెట్టు ఎక్కింది. ప్ర‌ముఖ నిర్మాత ఆర్ బీ చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో మెగా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ లో ‘ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్నాడు. అదేవిధంగా.. శివానీ రాజశేఖర్ తో కలిసి ‘వెన్నెల’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కాకుండా.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లోనూ ఓ సినిమా చేయడానికి కమిట్ అయినట్టు సమాచారం. ఈ బ్యాన‌ర్ ట్రాక్ రికార్డు ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఎన్నో భారీ చిత్రాల‌ను నిర్మించి, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు సాధించింది. ఈ బ్యాన‌ర్లో వ‌చ్చిన మెగాస్టార్ ‘చూడాలనివుంది’ చిత్రం ద్వారానే తెరంగేట్రం చేశాడు తేజ. ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించాడు. ఇప్పుడు అదే బ్యాన‌ర్ లో హీరోగా చేయ‌బోతుండ‌డం విశేషం.