Begin typing your search above and press return to search.

తేజ స‌జ్జా రెండో సినిమా ''ఇష్క్'' విడుదల తేదీ ప్రకటన..!

By:  Tupaki Desk   |   13 April 2021 11:30 AM GMT
తేజ స‌జ్జా రెండో సినిమా ఇష్క్ విడుదల తేదీ ప్రకటన..!
X
యువ హీరో తేజ సజ్జా - ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ''ఇష్క్''. 'నాట్‌ ఎ లవ్‌స్టోరీ' అనేది దీనికి ఉపశీర్షిక. యస్‌.యస్‌.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సౌత్ ఇండియాలోని పెద్ద బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం త‌ర్వాత మళ్ళీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌ - పార‌స్ జైన్‌ - వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌ - సాంగ్స్‌ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న 'ఇష్క్' చిత్రాన్ని విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్‌ ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సంద‌ర్భంగా వదిలిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. తేజ స‌జ్జా - ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ వేరు వేరు త‌లుపుల నుండి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా మ‌ధ్య‌లో ఒక కారు ఉండేలా ఈ పోస్ట‌ర్ ని డిజైన్ చేశారు. కాగా, ఇప్పటికే ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన 'టక్ జగదీష్' 'తలైవి' వంటి సినిమాల విడుదల వాయిదా పడటంతో.. ఈ గ్యాప్ ని 'ఇష్క్' తో ఫిల్ చేయాలని మ్మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

'ఇష్క్' చిత్రానికి మహ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తుండగా.. లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరిస్తుండగా.. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌ గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇటీవ‌ల 'జాంబీ రెడ్డి' మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జా.. ''ఇష్క్‌'' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. .