Begin typing your search above and press return to search.

వీడియో: మూతి తిప్పుడు కన్ను కొట్టినంత వీజీ కాదు ప్రియా..!

By:  Tupaki Desk   |   17 April 2021 9:30 AM GMT
వీడియో: మూతి తిప్పుడు కన్ను కొట్టినంత వీజీ కాదు ప్రియా..!
X
'జాంబిరెడ్డి' వంటి హిట్ సినిమా తర్వాత యువ హీరో తేజా సజ్జా నటిస్తోన్న చిత్రం ''ఇష్క్''. 'నాట్‌ ఎ లవ్‌స్టోరీ' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో ప్రియా ప్రకాష్‌ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌.ఎస్‌. రాజు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్ర‌సాద్‌ - పార‌స్ జైన్‌ - వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ట్రైలర్ కూడా అలరించింది.

'ఇష్క్' సినిమా మరో ఆరు రోజుల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ఓ సెలబ్రిటీని ఫోన్ చేసి పిలవడానికి తేజ పడిన కష్టాలు అంటూ చేసిన ఫన్నీ వీడియో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రియా ప్రకాష్ - 'బిగ్ బాస్' ఫేమ్ గంగవ్వ లకు సంబంధించిన ఓ వీడియోని వదిలారు. కన్నుగీటి దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన ప్రియాకు మూతి తిప్పడం నేర్పిస్తోంది గంగవ్వ. మూతి తిప్పుడు కన్ను కొట్టినంత వీజీ కాదని హీరోయిన్ కి చెబుతోంది.

కాగా, 'ఇష్క్' చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా.. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌ గా వ్యవహరిస్తున్నాడు. బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకొని హీరోగా మారిన తేజ స‌జ్జా నటించిన రెండో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.