Begin typing your search above and press return to search.

కుర్ర హీరోకి సూప‌ర్ గుడ్ బంప‌రాఫర్ త‌గిలిందిగా

By:  Tupaki Desk   |   22 Oct 2020 4:00 PM GMT
కుర్ర హీరోకి సూప‌ర్ గుడ్ బంప‌రాఫర్ త‌గిలిందిగా
X
బాల‌న‌టుడు తేజ సజ్జా ‘ఓ బేబి’ చిత్రంతో పూర్తి స్థాయి నటుడిగా తెర‌కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. తన మొదటి చిత్రంతోనే తేజా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ టీనేజీ బోయ్ లీడ్ హీరోగా సంతకం చేసాడ‌ని స‌మాచారం. ప్రస్తుతం అత‌డికి రెండు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు తాజాగా అతను ప్ర‌ఖ్యాత బ్యానర్ లో మరో క్రేజీ ప్రేమ‌క‌థా చిత్రానికి సంతకం చేశాడు.

మెగా సూపర్ గుడ్ బ్యానర్ న‌వ‌త‌రం హీరో తేజ‌ను ప్రోత్స‌హిస్తూ ఓ సినిమాని ప్రారంభించ‌నుంది. దీనికి సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించారు. తేజ మలయాళ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘ఇష్క్’ రీమేక్ లో న‌టించ‌నున్నారు. దసరాకి సినిమాని ప్రారంభిస్తారు.

ఈ రీమేక్ రొమాంటిక్ థ్రిల్లర్ మలయాళంలో మంచి విజ‌యం అందుకుంది. దర్శకుడు మరియు మిగిలిన తారాగణం మరియు సిబ్బంది వివరాలు త్వరలో చిత్ర‌బృందం వెల్ల‌డించ‌నుంది. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జాంబీ రెడ్డి’ ... శివానీ రాజశేఖర్ నటించిన నాయికా ప్ర‌ధాన చిత్రంలోనూ తేజ న‌టిస్తున్నాడు. మహతేజా క్రియేషన్స్ బ్యానర్ కింద టైటిల్ నిర్ణ‌యించ‌ని చిత్ర‌మిది.