Begin typing your search above and press return to search.

బాలయ్యతో సెట్టవ్వలేదా? తేజ జవాబు ఇదీ..

By:  Tupaki Desk   |   13 May 2019 10:37 AM IST
బాలయ్యతో సెట్టవ్వలేదా? తేజ జవాబు ఇదీ..
X
ఎన్టీఆర్ జీవితాన్ని కథానాయకుడు.. మహానాయకుడు పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. బయోపిక్ రిజల్ట్ ఏంటో తెలిసిందే. అయితే ఈ బయోపిక్ కి తేజ దర్శకత్వం వహించాల్సింది. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో క్రిష్ జాయిన్ అయ్యారు. కెప్టెన్సీ నుంచి తేజ వైదొలగడంపై రకరకాల కామెంట్లు వినిపించాయి. ముక్కుసూటిగా ఉండే తేజకు బాలయ్యతో సెట్ కాలేదని.. విభేధాలు రావడంతో క్రిష్ ని దర్శకుడిగా రీప్లేస్ చేశారని మాట్లాడుకున్నారు. అయితే అది నిజమా? అంటే ఎవరి వైపు నుంచి సమాధానం లేదు. ఆ సినిమా కాస్టింగ్ ని కానీ.. లేదా ఇతరత్రా ఎవరిని ప్రశ్నించినా నో కామెంట్ ప్లీజ్.. సైలెన్స్ ప్లీజ్ అన్నవాళ్లే. ఆ ప్రశ్నను రచయిత బుర్రా సాయి మాధవ్ ని అడిగినా ఆయనా దాని గురించి ఎప్పుడూ పెదవి మెదపలేదు. దాంతో విభేధాలే కారణమని మీడియా ఫిక్సయ్యి దానినే ప్రచారం చేసింది కూడా.

అయితే బాలయ్యతో విభేదాలు నిజమా? అని తేజను ప్రశ్నిస్తే.. అదేం లేదనేయడం చర్చకు వచ్చింది. ఓ ప్రముఖ వార్తాచానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ ఆ బయోపిక్ నుంచి తాను తప్పుకోవడానికి అసలు కారణం ఇదీ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ గురించి చాలా పెద్ద చర్చ సాగింది. సినిమా ప్రారంభించి వారం పాటు షూటింగ్ చేశారు.. తర్వాత ఆగిపోయింది. కారణమేంటి? అంటే.. నేను ఎన్టీరామారావుగారికి న్యాయం చేయలేనిపించింది. ఆయన లైఫ్ ను కథను సినిమా తీసేంత ట్యాలెంట్ నాకు లేదు. అందుకే చేయలేదు అని తెలిపారు. అదొక్కటే కారణమా..? కథ రెడీ అయ్యి సెట్స్ కెళ్లాక ఎందుకు కాన్ఫిడెన్స్ పోయింది? అని ప్రశ్నిస్తే ఓపెనింగ్ అయిన తర్వాత కథను డెప్త్ లోకి వెళ్లి పరిశీలిస్తే రామారావు గారి సినిమాక న్యాయం చేయలేననిపించింది అనీ సమాధానమిచ్చారు. బాలకృష్ణతో సెట్టవ్వకపోవడమే కారణమా? అని రెట్టించి ప్రశ్నిస్తే.. అదేం లేదని తెలిపారు. నేనెప్పుడూ నా పర్సనల్ వ్యూయే చూసుకుంటాను. బాలయ్య ఏం ఫీలయ్యారు అన్నది చూడను. నాకు కావాల్సింది ఏదో ఒక ట్రిక్ వాడి చేయించుకుంటాను.. అనీ అన్నారు. అంటే సినిమా చేయాలి అనుకుంటే బాలయ్యను కూడా ఏదో ట్రిక్ వాడి కన్విన్స్ చేసేవాడేనని దీనిని బట్టి అర్థమైంది.

క్రిష్ తీసిన బయోపిక్ చూశారా.. మీరనుకున్న విధంగా వచ్చిందా? అన్న ప్రశ్నకు .. అస్సలు ఆ బయోపిక్ ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదని అన్నారు. ఎందుకలా? అని ప్రశ్నిస్తే.. చూసిన తర్వాత నేనైతే ఎలా తీసేవాడిని.. వాళ్లు ఎలా తీసారు.. అన్న పోలిక ఆలోచించాల్సి ఉంటుంది. నేను సూటిగా మాట్లాడతాను.. అదంతా ఎందుకని చూడలేదు... అంటూ తాపీగా సమాధానమిచ్చారాయన. ఎన్టీఆర్.. ఎంజీఆర్ ఫేవరెట్ హీరోలు అని చెప్పిన తేజ తన ఫేవరెట్ గురించి కాంట్రవర్శీ చేయకూడదనే భావించారని అర్థమైంది. సినిమా చేయకపోయినా నాకు మంచి పేరే వచ్చింది. తేజ ఇలా తీసేవాడు కాదు అని అన్నారు. కానీ నేను ఏకీభవించను. నాకు చేతకాకే వదిలేశాను. నేను ఇంకా దరిద్రంగా తీసేవాడినేమో.. అని వ్యాఖ్యానించారు తేజ. మీరు ఎందుకు అగ్రెస్సివ్ గా ఉంటారు.. మారరా? అని ప్రశ్నిస్తే పుట్టుకతో వచ్చింది పిడకలతో కానీ పోదు కదా? అని తేజ వ్యాఖ్యానించారు.