Begin typing your search above and press return to search.

వేట‌కి సిద్ద‌మైన తేజ్..ఇక ఆటే!

By:  Tupaki Desk   |   21 Feb 2022 10:30 AM GMT
వేట‌కి సిద్ద‌మైన తేజ్..ఇక ఆటే!
X
సుప్రీం హీరో సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత కొన్ని రోజుల పాటు అజ్ఞానంలోకి వెళ్లిపోయారు. కేవ‌లం త‌న సినిమా స్నేహితుల్ని..కుటుంబ స‌భ్యుల్ని త‌ప్ప ఇంకెవ‌ర్నీ క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. మ‌ధ్య‌లో కొన్ని మీడియా సంస్థ‌లు ఇంట్లోనే ఉన్నార‌ని ఇంట‌ర్వ్యూలు తీసుకుందామ‌ని ప్ర‌య‌త్నించినా వీలుప‌డ‌లేదు.

యాక్సిడెంట్ కార‌ణంగా చిన్న పాటి గాయాలు..లుక్ ప‌రంగానూ మార్పులు రావ‌డంతో తేజ్ ఎవ‌ర్నీ చూడ‌టానికిగానీ..క‌ల‌వ‌డానికి గానీ ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే కొద్ది రోజులుగా మ‌ళ్లీ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చారు. నెట్టింట కొత్త ఫోటోల్ని షేర్ చేస్తూ ఐయామ్ రెడీ అన్న సంకేతాల్ని ఇచ్చేసారు. తాజాగా `ట్ర‌స్ట్ ది ప్రాసెస్ ఆప్నా టైమ్ ఆగ‌యా` అంటూ కొన్ని కొత్త ఫోటోల్ని వ‌దిలారు.

ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. తాజాగా రిలీజ్ అయిన ఫోటోలు చూస్తుంటే తేజ్ రీలోడెడ్ వెప‌న్ లా తూటాలు పేల్చ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాడు. ఆరోగ్య ప‌రంగా పూర్తిగా కోలుకున్న‌ట్లు క‌నిస్తున్నాడు. లుక్ ప‌రంగా మ‌రింత షైన్ అయ్యాడు. దీంతో తేజ్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సాయితేజ్ చివ‌రిగా `రిప‌బ్లిక్` సినిమాలో న‌టించారు. ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోన్న స‌మ‌యంలో బైక్ యాక్సిడెంట్ జ‌రిగింది. దీంతో సినిమా ప్ర‌చారం ప‌నుల‌కు దూరంగా ఉన్నారు. ఆ బాధ్య‌త‌ల్ని ప‌వ‌న్ కళ్యాణ్ తీసుకుని రిలీజ్ వ‌ర‌కూ స‌హ‌క‌రించారు. కానీ సినిమా ఫ‌లితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఈ చిత్రానికి దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

సాయితేజ్ కోలుకున్నాడు కాబ‌ట్టి ఈసారి మ‌ళ్లీ కెరీర్ ని స్పీడ‌ప్ చేస్తాడు.

`చిత్రల‌హ‌రి` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ రాలేదు. `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` యావ‌రేజ్ గా ఆడింది. అటుపై `రిప‌బ్లిక్` ఫ‌లితం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సాయితేజ్ కి హిట్ ప‌డాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అయితే ప్ర‌స్తుతానికి సాయితేజ్ చేతిలో అధికారికంగా ఎలాంటి క‌మిట్ మెంట్లు లేవు.

విశ్రాంతి స‌మ‌యంలో ఏ డైరెక్ట‌ర్ తోనైనా క‌మిట్ అయ్యారా? అన్న‌ది తెలియాలి. అలా రెడీ గా ఉంటే ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌డ‌మే ఆల‌స్యం. తేజ్ త‌మ్మ‌డు వైష్ణ‌వ్ తేజ్ దూసుకుపోతున్నాడు. `ఉప్పెన‌`తో తొలి స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్నాడు. `కొండ‌పొలం` క్రిష్ మార్క్ చిత్రంగా చెల్లిపోయింది.