Begin typing your search above and press return to search.

హీరోలను ఏకిపారేసిన తేజ

By:  Tupaki Desk   |   9 Sept 2015 5:29 PM IST
హీరోలను ఏకిపారేసిన తేజ
X
తేజ.. ఈ పేరు ఓ సంచలనం. సినిమాలతోనే కాదు, మాటలతోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆయనకు అలవాటు. ఈ మధ్య ‘హోరాహోరీ’ ఆడియో ఫంక్షన్ లో మొత్తం టాలీవుడ్ మీద ఆయన చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు తేజ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనతో పని చేసిన హీరోల మీద ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు హీరోలు కృతజ్నత చూపరంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు. పేర్లు పెట్టి మరీ ఆయన విమర్శలు గుప్పించడం విశేషం.

‘‘ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఇప్పుడు రోజులు అలా లేవు. ఈ తరం హీరోలు కృతజ్నత చూపించరు. నేను ఉదయ్ కిరణ్ - నితిన్ - నవదీప్ లాంటి హీరోల్ని ఇంట్రడ్యూస్ చేశాను. గోపీచంద్ కష్టాల్లో ఉన్నపుడు లైఫ్ ఇచ్చాను. ఐతే వాళ్లలో చాలామంది మంచి స్థితికి చేరాక నన్ను విస్మరించారు. నేను ఫోన్ చేసినా తీయలేని స్థితికి చేరుకున్నారు. ఐతే కాజల్ - సుమన్ శెట్టి లాంటి వాళ్లు మాత్రం నాతో టచ్ లో ఉన్నారు. ఎప్పుడైనా నాతో పని చేయడానికి రెడీ అని చెప్పారు. ప్రధానంగా హీరోలతో, వారి తలబిరుసుతో నాకు సమస్య. వాళ్లు ఏనాడూ కృతజ్నతా భావంతో లేరు. ఐతే అలాగని నేనేమీ కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయకుండా ఆగను. ప్రతి విషయాన్ని నేను సానుకూల దృక్పథంతో చూస్తా. వేరే వాళ్లకు సాయం చేయడానికి ప్రయత్నిస్తా’’ అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు తేజ.

ఇంతకీ తేజ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో మరి. ఆయన పేర్లు చెప్పిన వాళ్లందరూ తనతో అలాగే ప్రవర్తించారా? లేదా అందులో కొందరా? ఏదేమైనా తేజ కొత్త సినిమా ‘హోరాహోరీ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తేజ మళ్లీ మునుపటి ఫామ్ అందుకోవాలని ఆశిద్దాం.