Begin typing your search above and press return to search.
ఆటల్లో కళల్లో ఉన్నానంటే మావయ్యే కారణం.. తేజ్ ఎమోషన్
By: Tupaki Desk | 29 Oct 2020 7:40 PM ISTమెగా మేనల్లుడు సాయి తేజ్ కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ఆరంభమే బ్లాక్ బస్టర్ విజయంతో కెరీర్ ని పరిగెత్తించాలని చూసినా కాలక్రమంలో వరుస పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత నెమ్మదిగా రెండు వరుస హిట్లతో రికవరీ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ బండి ట్రాక్ లో పడ్డాక వరస విజయాలపై కన్నేశాడు. నెమ్మదిగా మెగా కాంపౌండ్ లో బ్యాంకబుల్ హీరోగా సుస్థిరం అయిపోతున్నాడు. అంతేకాదు తన సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా లాంచ్ చేస్తూ తెలివైన ఎత్తుగడలతో ముందుకు వెళ్లిపోతున్నాడు.
అయితే ఇంతటి ప్రయాణం వెనక ఉన్న షాడో ఎవరో తెలుసా? ఆ సంగతిని ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు సాయి తేజ్. అసలు తాను స్పోర్ట్స్ లో కానీ ఆర్ట్స్ (కళల్లో) లో కానీ ఉన్నాడంటే అందుకు కారణం నాగబాబు మావయ్యేనట. ఆయన ఎంకరేజ్ మెంట్ తోనే ఇంతటివాడినయ్యానని వినమ్రంగా చెప్పాడు. నేడు నాగబాబు మావయ్య బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ అసలు సంగతిని రివీల్ చేసాడు.
ఆటల్లో కళల్లో తనకు అన్నిటా అండగా నిలిచిన నాగబాబు మావయ్య ప్రధాన పిల్లర్ అంటూ పొగిడేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ కోసం మెగా మావయ్యలు చిరంజీవి- నాగబాబు- పవన్ కల్యాణ్ తమవంతు ప్రోత్సాహం అందించిన సంగతి తెలిసినదే. అందులో నాగబాబు మావయ్య సపోర్టు వేరు అని ఎమోషన్ అయిపోయాడు తేజ్. ప్రస్తుతం అతడు నటించిన సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ కి రానుంది.