Begin typing your search above and press return to search.

తీస్ మార్ ఖాన్ అయినా గ‌ట్టెక్కించేనా?

By:  Tupaki Desk   |   18 Jun 2022 7:03 AM GMT
తీస్ మార్ ఖాన్ అయినా గ‌ట్టెక్కించేనా?
X
యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రేమ క‌థా చిత్రాల‌తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ప్రేమ కావాలి, ల‌వ్ లీ వంటి రొమాంటిక్ ల‌వ్ స్టోరీలతో మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం ఆ స్థాయి స‌క్సెస్ ల కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఆరు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్న ఆది సాయికుమార్ త్వ‌ర‌లో 'తీస్ మార్ ఖాన్‌' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

'స్టూడెంట్ - రౌడీ - పోలీస్‌' అనే ట్యాగ్ లైన్. 'నాట‌కం' వంటి విభిన్న‌మైన చిత్రాన్ని రూపొందించి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న క‌ల్యాణ్ జి గోగ‌ణ ఈ మూవీని రూపొందిస్తున్నారు. పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్రొడ‌క్ష‌న్ నం.3 గా విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ వ్యాపార వేత్త నాగం తిరుప‌తిరెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్, పూర్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ని చిత్ర బృందం తాజాగా విడుద‌ల చేసింది. ఇక నిమిషం 34 సెక‌న్ ల నిడివితో ఈ టీజ‌ర్ ని క‌ట్ చేశారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీ ని రూపొందించిన‌ట్టుగా తెలుస్తోంది.

'ఆఫీస్ కు వెళ్లిన మా అన్న తిరిగి రాలేదు...అస‌లు ఏం జ‌రుగుతోంది ఇక్క‌డ‌.. మ‌నం ఆపాల‌నుకున్న ప‌వ‌ర్ మ‌న ద‌గ్గ‌ర వున్నా మ‌నం ఆప‌లేనంత ప‌వ‌ర్ వాడిద‌గ్గ‌రుంది స‌ర్‌.. రాక్ష‌సుడికి ర‌క్ష‌కుడు అంటే ఏంటో చూపించండి'.. అంటూ సాగే డైలాగ్స్ తో టీజ‌ర్ మొద‌లైంది.

స్టూడెంట్ - రౌడీ - పోలీస్ గెట‌ప్ ల‌లో ఆది సాయికుమార్ క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. అంతే కాకుండా పాయ‌ల్ రాజ్ పుత్‌, ఆదిల బీచ్ రొమాన్స్ యూత్ ని ఆక‌ట్టుకునేలా వుంది. ఇక ఆది సాయికుమార్ క్యారెక్ట‌ర్ ని మూడు పార్శాల్లో చూపిస్తూ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా సినిమా వుండ‌బోతోంద‌ని క్లారిటీ ఇచ్చారు. ఆది సాయి కుమార్ పై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు, పాయ‌ల్ తో ఆది చేసే రొమాన్స్ సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా క‌నిపిస్తోంది.

ఆదిని యాక్ష‌న్ హీరోగా నిల‌బెట్టాల‌ని చేస్తున్నా ఈ మూవీ అయినా అత‌నికి హిట్ ని అందించాల‌ని టీమ్ అంతా కోరుకుంటోంది. ఆదిని మూవు వేరియేష‌న్స్ ల‌లో చూపిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్‌, బాల్ రెడ్డి ఫొటో గ్ర‌ఫీ, మ‌ణికాంత్ ఎడిటింగ్ అందిస్తున్నారు.