Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: 'అసురన్' ని దింపేసిన 'నారప్ప'

By:  Tupaki Desk   |   12 Dec 2020 7:55 PM IST
టీజర్ టాక్: అసురన్ ని దింపేసిన నారప్ప
X
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''నారప్ప''. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సురేష్ బాబు మరియు క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'అసురన్' కి రీమేక్ గా 'నారప్ప' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్ మధ్య వయస్కుడైన రైతుగా.. ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నాడు. ఇక నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుంది. ఇప్ప‌టికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో రేపు వెంకటేష్ 60వ బర్త్ డే కానుకగా 'నారప్ప' మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ టీజర్ లో నారప్ప గెటప్ లో ఉన్న వెంకటేష్ చేతిలో కత్తి పట్టుకొని ఓ చెట్టుచాటు నుంచి ఆవేశంగా నడుస్తూ వస్తుంటాడు. ఆ తర్వాత కత్తితో ప్రత్యర్థులను నరికి తనదైన శైలిలో ఆకాశంలోకి చూసి పెద్దగా అరవడంతో ఈ టీజర్‌ పూర్తయ్యింది. డైలాగులు లేకుండా కేవలం మణిశర్మ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తోనే చూపించారు. నారప్ప లుక్ లో వెంకీ పరకాయ ప్రవేశం చేసినట్లు అర్థం అవుతోంది. అయితే 'నారప్ప' టీజర్ చూస్తుంటే 'అసురన్' చిత్రాన్ని అదే విధంగా అనుకరించినట్లు తెలుస్తుంది. వెంకటేష్ కెరీర్‌ లో 74వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వెంకటేష్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.