Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : ల‌వ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది

By:  Tupaki Desk   |   10 Jan 2023 6:12 AM GMT
టీజ‌ర్ టాక్ : ల‌వ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది
X
కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటూ హీరోగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఆయ‌న న‌టిస్తున్న లేటెస్ట్ ఎంట‌ర్ టైన‌ర్ 'విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌'. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌శ్మీర ప‌ర్దేశి క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' నుంచి '18 పేజెస్' వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని సూప‌ర్ హిట్ ల‌ని అందించిన జీఏ2 పిక్చ‌ర్స్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది.

తిరుమ‌ల తిరుప‌తి నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన క‌థ‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ముర‌ళీ కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన లిరిక‌ల్ వీడియో 'వాస‌వ‌స‌హాస‌' ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. మంగ‌ళ‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ల‌వ్‌, కామెడీ, థ్రిల్ల‌ర్ అంశాల క‌ల‌బోత‌గా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది.

'నా పేరు విష్ణు..ఆ జీవితాల‌న్నీ ఏడు కొండ‌ల చుట్టూ తిరుగ‌తా వుంటాయి. ఇంకొన్ని రోజుల్లో మీరంద‌రూ చూడ‌బోయేదే నా క‌థ‌' అంటూ కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెబుతున్న డైలాగ్ ల‌తో అహ్ల‌ద‌క‌ర‌మైన సంగీతంతో టీజ‌ర్ మొద‌లైంది. క‌థంటున్న‌వ్ ఏంటీ ల‌వ్ స్టోరీనా...'ఈ రోజుల్లో ల‌వ్ లేకుండా ఏ స్టోరీ వుంటుంది స‌ర్‌..కాన్సెప్ట్ తో మొద‌లై ల‌వ్వు కామెడీ మిక్స‌యి క్రైమ్ నుంచి స‌స్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామా అనుకోవ‌చ్చు' అని కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెప్ప‌డం.. ఆక‌ట్టుకుంటోంది.

ముర‌ళీ శ‌ర్మ చిరిగిన జీన్స్ వేసుకుని బాల‌య్య స్టెప్స్ ట్రై చేయ‌డం.. ఆమ‌నిని ప‌ట్టుకుని ఆంటీ అన‌డం.. త‌ను వెంట‌నే బ్ర‌ద‌ర్ అంటూ పిల‌వ‌డం న‌వ్వులు పూయిస్తోంది. టీజ‌ర్ చూస్తుంటే ముర‌ళీశ‌ర్మ‌తో ఓ రేంజ్ లో కామెడీ ప్లాన్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. స‌ర్ వీళ్లంతా గుండ్లు కొట్టుకుని మ‌నీ హైస్ట్ బ్యాచ్ ల క‌నిపిస్తున్నార‌ని కిర‌ణ్ అబ్బ‌వ‌రం అంటే నేను కూడా త్వ‌ర‌లో చెబుతారంటూ విల‌న్ చెప్ప‌డం కొస‌మెరుపు.

మొత్తానికి డైలాగ్ లో చెప్పిన‌ట్టే ఈ మూవీని ల‌వ్‌, కామెడీ, థ్రిల్ల‌ర్ అంశాల క‌ల‌బోత‌గా తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. విశ్వాస్ ఫొటోగ్ర‌ఫీని అందించిన ఈ మూవీకి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించాడు. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో సాగే ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 17న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.