Begin typing your search above and press return to search.

టీజర్‌ టాక్‌ : కార్తీ మళ్లీ కొట్టేలా ఉన్నాడే

By:  Tupaki Desk   |   16 Nov 2019 9:46 AM GMT
టీజర్‌ టాక్‌ : కార్తీ మళ్లీ కొట్టేలా ఉన్నాడే
X
తమిళ హీరో కార్తీ ఇటీవలే 'ఖైదీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లేకుండానే ఖైదీ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్‌ లో చేరింది. కార్తీకి మొదటి వందకోట్ల సినిమాగా ఖైదీ నిలిచింది. పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన ఖైదీ సినిమా వంద కోట్లు రాబట్టడంతో ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంపై ప్రేక్షకులు ఫోకస్‌ పెట్టారు. కార్తీ తదుపరి చిత్రం 'తంబి' ఫస్ట్‌ లుక్‌ ఇటీవలే విడుదలైంది.

తంబి సినిమాను తెలుగులో 'దొంగ' అనే టైటిల్‌ తో డబ్‌ చేయబోతున్నారు. దొంగ సినిమా టీజర్‌ విడుదలైంది. జ్యోతిక మరియు కార్తీలు అక్క తమ్ముడుగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా టీజర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. 'దృశ్యం' వంటి ఒక అద్బుతమైన సినిమాను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చేసింది.

దొంగ టీజర్‌ చూసిన తర్వాత కార్తీ మరో విజయాన్ని అందుకోవడం ఖాయం అనిపిస్తుంది. వదిన మరిది అయిన జ్యోతిక మరియు కార్తీలు ఈ చిత్రంలో కలిసి నటించడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దానికి తోడు ఈ చిత్రంలో కార్తీ రెండు విభిన్నమైన లుక్స్‌ తో కనిపిస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు.

ఈ చిత్రంలో నిఖిల విమల్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా కీలక పాత్రలో సత్యరాజ్‌ నటించాడు. సెంటిమెంట్‌ తో పాటు మాస్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉంటాయని ఈ టీజర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. తప్పకుండా కార్తీ ఈ చిత్రంతో మరో హిట్‌ కొట్టేలా ఉన్నాడంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.