Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్‌: ప్ర‌తి మ‌నిషికి ర‌హ‌స్య జీవితం ఉంది!

By:  Tupaki Desk   |   29 April 2022 4:18 AM GMT
టీజ‌ర్ టాక్‌: ప్ర‌తి మ‌నిషికి ర‌హ‌స్య జీవితం ఉంది!
X
మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్- జీతూ జోసెఫ్ ల కలయిక అంటేనే బోలెడంత క్రేజ్ ఉంటుంది. ఇంత‌కుముందు ఈ జోడీ నుంచి దృశ్యం - దృశ్యం 2 వంటి సూపర్ హిట్ చిత్రాలు పలు భాష‌ల ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

మ‌ల‌యాళం- త‌మిళం- తెలుగులో బంప‌ర్ హిట్ సిరీస్ గా దృశ్యం సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు ఇదే జోడీ త‌మ‌ కొత్త ప్రాజెక్ట్ ట్వ‌ల్త్ మ్యాన్ తో తిరిగి వస్తున్నారు. ఈ చిత్రం డిస్నీ ప్ల‌స్‌ హాట్ స్టార్ లో నేరుగా విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి ప‌బ్లిక్ లైఫ్‌.. ప్ర‌యివేట్ లైఫ్‌.. సీక్రెట్ లైఫ్ .. ఇలా మూడు విభిన్న జీవితాలు ఉంటాయని టీజర్ చెబుతోంది. టీజర్ ముగింపులో లాల్ చెప్పిన డైలాగ్ క్యూరియాసిటీని పెంచింది. ''ఫైనల్ విజిల్ వేసే సమయం వచ్చింది'' అనే డైలాగ్ తో థ్రిల్ల‌ర్ లో అత‌డి పాత్ర ప్రాధాన్య‌త‌ను అంచ‌నా వేయొచ్చు.

టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది. జీతూ -మోహన్ లాల్ మరో థ్రిల్లర్ తో అల‌రించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ట్వ‌ల్త్ మ్యాన్ లో ఉన్ని ముకుందన్- సైజు కురుప్- శివద- అను సితార- అనుశ్రీ- ప్రియాంక నాయర్- అను మోహన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్ర‌తి సాధార‌ణ మ‌నిషిలో ఎవ‌రూ ఊహించ‌ని ర‌హ‌స్య కోణం ఉంటుంద‌నేది ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ట్వ‌ల్త్ మ్యాన్ అని టైటిల్ పెట్ట‌డం వెన‌క రీజ‌న్ ఏమిట‌న్న‌ది తెర‌పై చూశాకే అర్థ‌మ‌వుతుంద‌న్న‌మాట‌. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. దృశ్యం 2 - బ్రో డాడీ వంటి చిత్రాల తర్వాత మోహన్ లాల్ ట్వ‌ల్త్ మ్యాన్ నేరుగా OTT లో విడుదల చేస్తున్నారు.