Begin typing your search above and press return to search.

వాంటెడ్.. దుర్గా రాణి సింగ్!!!

By:  Tupaki Desk   |   18 Oct 2016 5:24 PM GMT
వాంటెడ్.. దుర్గా రాణి సింగ్!!!
X
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటించగా.. నాలుగేళ్ల క్రితం వచ్చిన కహానీ మూవీ ఏ రేంజ్ సంచలనాలు సృష్టించిందో చూశాం. కేవలం 8 కోట్ల రూపాయల ఖర్చుతో తీసిన ఈ చిత్రానికి.. 104 కోట్ల వసూళ్లు దక్కాయంటే.. విద్యా బాలన్ స్టామినా.. దర్శకుడు సుజోయ్ ఘోష్ ట్యాలెంట్ అర్ధవుతాయి.

ఇప్పుడీ మూవీకి సీక్వెల్ గా కహానీ2 వచ్చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అవగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిఫరెంట్ గా డిజైన్ చేసి వదిలాడు దర్శకుడు. వాంటెడ్ పోస్టర్ టైపులో డిజైన్ చేయగా.. ఈమె పాత్ర పేరు దుర్గారాణి సింగ్.. వయసు 36 ఏళ్ల అంటూ మరిన్ని వివరాలిచ్చారు. అయితే.. ఈ వాంటెడ్ పోస్టర్ లో అర్ధం పరమార్ధం వేరే ఉంది. దుర్గారాణి సింగ్ కోసం కాదు.. ఆమెను కిడ్నాప్ అండ్ మర్డర్ చేసేవారు కావాలంటూ పోస్టర్ వేశారు. పోస్టర్ లో విద్యా బాలన్ లుక్ చూస్తే.. అంతటి అందాల భామ.. ఇంత డీ గ్లామ్ రోల్ చేస్తోందా అనిపించక మానదు.

ఇవి చేయగలిగిన వాళ్లు సంప్రదించాల్సిన సోషల్ నెట్వర్క్ అడ్రస్ కూడా ఇచ్చారులెండి. ఈ కహానీ2 ను డిసెంబర్ 2న విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. కహానీ2తో ఆడియన్స్ ను మరోసారి విద్యాబాలన్ పెద్ద షాక్ కే గురి చేస్తుందని.. యూనిట్ ధీమాగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/