Begin typing your search above and press return to search.
టీజర్: భావోద్వేగాల సమ్మేళనంగా
By: Tupaki Desk | 12 Nov 2022 6:31 AM GMTనేచురల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా చిత్రాలను నిర్మిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ మీద ప్రశాంతి తిపిర్నేనితో కలిసి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తున్నారు. ఇప్పుడు "మీట్ క్యూట్" అనే ఆంథాలజీతో వస్తున్నారు.
"మీట్ క్యూట్" చిత్రంతో నాని సోదరి దీప్తి ఘంటా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హక్కులను సంపాదించిన సోనీ లివ్ ఓటీటీ.. ఈ సిరీస్ ని త్వరలో స్ట్రీమింగ్ చేయటానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను ప్రారంభించారు.
అపరిచితుల యాదృచ్ఛిక కలయిక.. ఆహ్లాదకరమైన సంభాషణలు మరియు భావోద్వేగాల సమ్మేళనంగా ఈ టీజర్ కనిపిస్తుంది. ఈ చిన్న వీడియోలో ప్రేమ, కోపం, ఆశ, భయం, ఆశ్చర్యం, ఆశ్చర్యం, హార్ట్ బ్రేక్, నమ్మకం మరియు ఆనందం వంటి అన్ని ఎమోషన్స్ ను చూపించే ప్రయత్నం చేశారు.
రిలేషన్ షిప్స్ ఫెయిల్ అయ్యేది చిన్న చిన్న గొడవల వల్ల కాదు.. ఫైట్ చేయటం ఆపేసినప్పుడు ఫెయిల్ అవుతాయి అనే ఉత్సుకతను పెంచే నోట్ తో ఈ మీట్ క్యూట్ టీజర్ ముగుస్తుంది. ఇది అర్బన్ లవ్ స్టోరీలను ఆవిష్కరిస్తోంది. దీప్తి ఘంటా తన మొదటి ప్రయత్నంలో రచయితగా డైరక్టర్ గా ప్రభావాన్ని చూపిందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ఆడియెన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
"మీట్ క్యూట్" లో సత్యరాజ్ మరియు రోహిని ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా.. అదా శర్మ - వర్ష బోల్లమ్మ - ఆకాంక్ష సింగ్ - రుహానీ శర్మ - సునయన - సంచిత పూనచా ఫిమేల్ లీడ్స్ లో.. అశ్విన్ కుమార్ - శివ కందుకూరి - దీక్షిత్ శెట్టి - గోవింద్ పద్మసూర్య మరియు రాజా మేల్ లీడ్ రోల్స్ లో నటించారు.
ఈ సిరీస్ కు విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చగా.. కేకే సాహిత్యం అందించారు. వసంత కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. దీనికి ఎస్. వెంకటరత్నం (వెంకట్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఆంథాలజీ సిరీస్ లు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదనే చెప్పాలి. మరి ఇప్పుడు నాని సమర్పిస్తున్న "మీట్ క్యూట్" ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సిరీస్ సోని లివ్ ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.