Begin typing your search above and press return to search.

ర‌ష్యాలో కూడా పుష్ప ఎక్క‌డా త‌గ్గ‌ట్లే!

By:  Tupaki Desk   |   30 Nov 2022 11:36 AM GMT
ర‌ష్యాలో కూడా పుష్ప ఎక్క‌డా త‌గ్గ‌ట్లే!
X
గ‌తంతో పోలిస్తే మ‌న సినిమాల‌కు విదేశాల్లో ఆద‌ర‌ణ క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది. మ‌న సినిమాల‌ని విదేశీ సినీ ప్రియులు కూడా రికార్డు స్థాయిలో ఆద‌రిస్తున్నారు. ఒక‌ప్పుడు హాలీవుడ్ సినిమాల‌కు మ‌న ద‌గ్గ‌ర ఆద‌రిస్తే ఇప్ప‌డు మ‌న సినిమాల‌కు ప్ర‌పంచ దేశాల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. గ‌తంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమాల‌కే విదేశీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేవారు. జ‌పాన్ లాంటి దేశాల్లో ర‌జ‌నీకి కోట్ల‌ల్లో ఫ్యాన్స్ వున్నారు. అది ఇప్ప‌డు మ‌రింత‌గా పెరిగి తెలుగు స్టార్స్ న‌టించిన పాన్ ఇండియా మూవీస్ కి కూడా పాక‌డం తెలిసిందే.

ఇప్ప‌డు తెలుగు స్టార్స్ కు కూడా అన్ని చోట్లా ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి`కి విదేశాల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డ‌మే కాకుండా ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల టాయ్ కూడా భారీ స్థాయిలో అమ్ముడు పోవ‌డం విశేషం. దీనికి నిద‌ర్శ‌న‌మే రీసెంట్ గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `RRR` కు ప‌లు దేశాల్లోని విదేశీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డమే.

రీసెంట్ గా ఈ మూవీని జ‌పాన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ముఖ్య‌మైన సిటీస్ లో విడుద‌లైన `RRR` అక్క‌డ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ఇప్ప‌టికే `బాహుబ‌లి` రికార్డుని తుడిచి పెట్టింది. రానున్న రోజుల్లో జ‌పాన్ లో `RRR` స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డం ఖాయం అని అంతా అంటున్నారు. ఇదిలా వుంటే ఇప్ప‌డు `RRR` త‌ర‌హాలో అల్లు అర్జున్ న‌టించిన‌ `పుష్ప‌` కూడా విదేశాల్లో రిలీజ్ అవుతోంది.

ఈ మూవీని ర‌ష్యాలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 8న భారీ స్థాయిలో ర‌ష్య‌న్ డ‌బ్బింగ్ వెర్ష‌న్ రిలీజ్ కానున్న నేప‌థ్యంలో చిత్ర బృందం న‌వంబ‌ర్ 30న ర‌ష్యా రాజ‌ధాని మాస్కోకు వెళ్లింది. హీరో అల్లు అర్జున్‌, రష్మిక మంద‌న్న‌, ద‌ర్శ‌కుడు సుకుమార్‌, నిర్మాత‌లలో ఒక‌రైన ర‌విశంక‌ర్ అక్క‌డికి చేరుకున్నారు. డిసెంబ‌ర్ 1న‌, అలాగే 3న సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ లో ప్ర‌త్యేక ప్రీమియ‌ర్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో చిత్ర బృందం అక్క‌డి మీడియాతో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది.

బుధ‌వారం మాస్కో వెళ్లిన చిత్ర బృందం ప్ర‌త్యేకంగా అక్క‌డి మీడియాతో స‌మావేశం అయింది. ఈ సంద‌ర్భంగా రష్య‌న్ మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు అల్లు అర్జున్ స‌మాధానాలు చెప్ప‌డ‌మే కాకుండా ఈ మూవీ కోసం తాను ఎంతో శ్ర‌మించాన‌ని, త‌ప్ప‌కుండా ర‌ష్య‌న్ ప్రేక్ష‌కుల‌కు `పుష్ప‌` న‌చ్చుతుంద‌ని తెలిపాడు. అంతే కాకుండా వ‌ర‌ల్డ్ లో నాకు న‌చ్చిన ప్లేస్ ల‌లో ర‌ష్యా కూడా ఒక‌టి అని స్ప‌ష్టం చేశాడు. ర‌ష్యాలో ప్ర‌మోష‌న్స్ ని ముగించుకుని టీమ్ హైద‌రాబాద్ వ‌చ్చిన వెంట‌నే డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీకెండ్ నుంచి `పుష్ప 2` షూటింగ్ ని మొద‌లు పెట్ట‌నుంద‌ని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.