Begin typing your search above and press return to search.

బ‌న్నీకి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన టీమ్ మెంబ‌ర్స్

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:28 PM GMT
బ‌న్నీకి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన టీమ్ మెంబ‌ర్స్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `పుష్ప‌`. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ అవుతూ ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఉత్త‌రాదిన ఈ మూవీ ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ప్రాంతీయ చిత్రంగా విడుద‌లై నేష‌న‌ల్ లెవెల్లో వైర‌ల్ గా మారిన ఈ మూవీ ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 96.75 కోట్లు రాబ‌ట్టి షాకిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఊహించ‌ని విజ‌యాన్ని `పుష్ప` త‌న‌కు అందించి త‌న‌ని పాన్ ఇండియా స్టార్ గా మార్చ‌డంతో బ‌న్నీ ఈ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ వ‌ర‌ల్డ్ వైడ్ గా చ‌రిత్ర సృష్టిస్తుండంతో అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తున్న బ‌న్నీ ఇటీవ‌ల దుబాయ్ కి వెకేష‌న్ కి వెళ్లారు. అక్క‌డి అందాల మ‌ధ్య దాదాపు 16 రోజులు గ‌డిపారు.

తాజాగా దుబాయ్ ట్రిప్ ముగియ‌డంతో బ‌న్నీ తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీకి ఊహించ‌ని వెల్క‌మ్ ల‌భించింది. బ‌న్నీ గ‌త 16 రోజుల పాటు దుబాయ్ లో వుండి తిరిగి రావ‌డంతో అత‌ని గారాల ప‌ట్టి అల్లు అర్హ వెరైటీగా వెల్క‌మ్ చెప్పి స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఊహించిన విధంగా త‌న కూతురు స్వాగ‌తం ప‌ల‌క‌డంతో బ‌న్నీ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఇదిలా వుంటే బ‌న్నీ టీమ్ కూడా స‌రికొత్త‌గా వెల్క‌మ్ చెప్పింది. బ‌న్నీ ఆఫీస్ ని పుష్ప మ‌యం చేసి స‌ర్‌ప్రైజ్ చేసింది. గంధ‌పు చెక్క‌లని త‌ల‌పించేలా ఆఫీస్ సీలింగ్ కి కొన్ని క‌ర్ర‌ల‌ని త‌ల‌పించే వాటిని వేలాడ‌దీశారు. అంతే కాకుండా `పుష్ప‌`లో బ‌న్నీ ఉప‌యోగించిన గొడ్డ‌లి, క‌త్తి వంటి ఆయుధాల‌ని ఆఫీస్ మ‌ధ్య‌లో ఓ టైబుల్ పై ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా బ‌న్నీ ఫేవ‌రేట్ స్టిల్ ని కూడా ప్ర‌త్యేకంగా అలంక‌రించి పెట్టారు.

ఇక ఎదురుగా బిగ్ సైజ్‌ `పుష్ప‌` ఫొటో ఫ్రేమ్‌ని ఏర్పాటు చేయ‌డం బ‌న్నీని బాగా ఆక‌ట్టుకుంది. దీంతో ఆనందాన్ని వ్య‌క్తం చేసిన బ‌న్నీ త‌న టీమ్ తో క‌లిసి ఆఫీస్ లో ఫొటోల‌కు పోజులిచ్చారు. ఈ ఫొటోల‌ని నెట్టింట షేర్ చేసిన బ‌న్నీ త‌న `AAFamily`కి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.