Begin typing your search above and press return to search.

సుశాంత్‌ మరణంతో అంతా దు:ఖంలో మీరు క్యూట్‌ నెస్‌ గురించి కామెంట్

By:  Tupaki Desk   |   2 Aug 2020 6:00 AM IST
సుశాంత్‌ మరణంతో అంతా దు:ఖంలో మీరు క్యూట్‌ నెస్‌ గురించి కామెంట్
X
ఒక వైపు బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా ఆలియా భట్‌ దూసుకు పోతుంటే మరో వైపు మాత్రం కంగనా విమర్శలతో చాలా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రతిభ లేకుండానే ఆలియా భట్‌ బాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కించుకుంటుంది అంటూ పదే పదే కంగనా విమర్శలు చేస్తూ వస్తుంది. కంగనా వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని ఆలియా భట్‌ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సుశాంత్‌ మరణం తర్వాత ఆలియాను మరింత ఎక్కువగా టార్గెట్‌ చేసి మరీ కంగనా కామెంట్స్‌ చేస్తుంది.

తాజాగా ఆలియా భట్‌ తన చిన్నప్పటి ఫొటోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోకు బాలీవుడ్‌ స్టార్స్‌ అయిన దీపిక పదుకునే.. హృతిక్‌ రోషన్‌.. జోయా అక్తర్‌ ఇంకా మనీష్‌ మల్హోత్రా లతో పాటు కొందరు బాలీవుడ్‌ సెలబ్రెటీలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్‌ చేశారు. దాదాపుగా 15 లక్షల లైక్స్‌ ఆలియా ఫొటోకు వచ్చాయి. లైక్స్‌ మాత్రమే కాకుండా ఆమె చిన్నప్పుడు ఎంత క్యూట్‌ గా ఉందో అంటూ నెటిజన్స్‌ తో పాటు సెలబ్రెటీలు కామెంట్స్‌ చేశారు.

ఆ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్‌ ఆన్‌ లైన్‌ మీడియా సంస్థ ప్రస్థావిస్తూ ఒక కథనంను రాయడం జరిగింది. ఆలియా క్యూట్‌ స్టిల్‌ కు మంచి స్పందన వచ్చిందని ఆ మీడియా సంస్థ రాసిన కథనంను షేర్‌ చేస్తూ కంగనా టీమ్‌ సుశాంత్‌ మరణించి దేశ వ్యాప్తంగా దు:ఖంలో ఉన్న సమయంలో మీరు అంతా ఆమె క్యూట్‌ నెస్‌ గురించి మాట్లాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆమె క్రిమినల్‌ ఫాదర్‌ చేసిన నేరాలు తుడిచి వేయాలనుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేయడంను తప్పుబట్టడంతో పాటు ఆ ఫొటోకు లైక్స్‌ చేసిన వారిని కూడా కంగనా టీం ఇలా ట్రోల్‌ చేయడం ఏమాత్రం సరి కాదంటూ ఆలియా అభిమానులు అంటున్నారు.