Begin typing your search above and press return to search.
#వైజాగ్ ఖరాబ్.. `గాలి సంపత్` సుడిగాలి వేలో..
By: Tupaki Desk | 16 Dec 2020 10:40 AM ISTనటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ విష్ణు- లవ్‌లీ సింగ్ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా `గాలి సంపత్`. డా. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. అనిల్ కో డైరెక్టర్ కం రచయిత ఎస్. క్రిష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అరకు.. బీచ్ సొగసుల విశాఖ సహా పలు అందమైన లొకేషన్స్ లో తెరకెక్కుతోంది.
ఇటీవల షూటింగ్ అరకులో పూర్తయింది. రాజేంద్ర ప్రసాద్.. హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం విశాఖ షెడ్యూల్ ని కంటిన్యూ చేశారు.
తాజా సమాచారం ప్రకారం .. గాలి సంపత్ వైజాగ్ షెడ్యూల్ సుడిగాలి వేగంతో పూర్తయిందని చిత్రబృందం వెల్లడించింది. టోటల్ సినిమా షూట్ 80శాతం పూర్తయింది. ఈ అందమైన అనుభవాన్ని షేర్ చేసుకోకుండా ఆగలేం! అంటూ ఫన్నీ నోట్ తో టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. తదుపరి హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.
ఇటీవల విడుదల చేసిన `గాలి సంపత్` కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. తండ్రీ కొడుకుల నడుమ ముందెన్నడూ చూడని ఓ విభిన్నమైన ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ వినోదాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్పీ.. శ్రీవిష్ణు పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.