Begin typing your search above and press return to search.

టీచర్ శృతికి టీజింగ్ మొదలైంది

By:  Tupaki Desk   |   3 Dec 2015 5:30 PM GMT
టీచర్ శృతికి టీజింగ్ మొదలైంది
X
ఓ వైపు సాహసం శ్వాసగా సాగిపో మూవీని రిలీజ్ కి రెడీ చేసిన నాగ చైతన్య.. నెక్ట్స్ మూవీ షూటింగ్ మొదలుపెట్టేశాడు. వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ కేంపస్ లో శృతి హాసన్ తో మజ్ను సందడి మొదలైపోయింది.

ఓ లవ్ ఫెయిల్యూర్ తర్వాత చైతు చదివే కాలేజ్ కి గెస్ట్ లెక్చరర్ గా వచ్చే రోల్ ని శృతి పోషిస్తోంది. ఇలా లెక్చరర్ గా కనిపించేందుకు, చైతు కంటే ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిగా ఉండేందుకు.. శృతి హాసన్ తన లుక్ ని మార్చేసుకుంది. హీరో కంటే కాస్త ఎక్కువ ఏజ్ ఉన్న రోల్ కావడంతో.. అమ్మడి గెటప్ మొత్తానికే మారిపోయింది. సాధారణంగా పొట్టి డ్రస్సుల్లో ఆడియన్స్ అదిరిపోయేలా కనిపించే శృతి.. ఈ మూవీలో నిండుగా చీర కట్టుకుని కనిపించనుంది. ముఖ్యంగా లెక్చరర్ రోల్ లో గంభీరంగా కనిపించేందుకు మంగళగిరి కాటన్ చీరలు ధరించడమే కాదు.. దాదాపు మేకప్ లేకుండా యాక్టింగ్ చేసేస్తోంది శృతి హాసన్.

మరోవైపు చైతూ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మూడు ఏజ్ గ్రూప్ లలో నాగ చైతన్య కనిపించనున్నాడు. ఇందుకోసి తన లుక్ లో వేరియేషన్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. మొత్తానికి చైతూ - శృతిల కాంబినేషన్ అదుర్స్ అంటున్నారు షూటింగ్ చూసినవాళ్లు.