Begin typing your search above and press return to search.

రౌడీ గారు చెన్నై రేస్ ట్రాక్ మీద..

By:  Tupaki Desk   |   5 March 2019 8:45 AM GMT
రౌడీ గారు చెన్నై రేస్ ట్రాక్ మీద..
X
విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' తో పాటుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ఒక తమిళ-తెలుగు ద్విభాషా చిత్రానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా తమిళ రచయిత ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా 'కాకా ముట్టై' కు కథ అందించిన వ్యక్తే ఈ ఆనంద్.

తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బైక్ రేసర్ పాత్రలో నటిస్తున్నాడట. సాధారణ బైక్స్ నడపడం వేరు రేసింగ్ బైక్స్ నడపడం వేరు.. దానికి ప్రాక్టిస్ తో పాటు నేర్పు కూడా అవసరం. అందుకే విజయ్ చెన్నైలోని ఒక రేసింగ్ ట్రాక్ మీద రేస్ బైక్ డ్రైవింగ్ లో మెళకువలు తెలుసుకుంటున్నాడట. ఇప్పటికే ఈ రెగ్యులర్ గా చెన్నైకి వెళ్తూ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తారని.. మొదటి షెడ్యూల్ లోనే ఢిల్లీలోని రేస్ ట్రాక్ పై బైక్ రేసింగ్ ఎపిసోడ్ చిత్రీకరిస్తారని అంటున్నారు. అందుకే విజయ్ చాలా సీరియస్ గా సాధన చేస్తున్నాడట. మనకు సౌత్ లో బైక్ రేసింగ్ నేపథ్యంలో సినిమాలు చాలా తక్కువ. మరి రౌడీగారు ఈ సారి కూడా ఏదో కొత్త సబ్జెక్ట్ ఎంచుకున్నట్టుగా ఉంది.