Begin typing your search above and press return to search.

బన్నీ పార్టీతో చిల్ అయిన టాక్సీవాలా టీమ్

By:  Tupaki Desk   |   19 Nov 2018 8:13 AM GMT
బన్నీ పార్టీతో చిల్ అయిన టాక్సీవాలా టీమ్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'టాక్సీవాలా' టీమ్ కు బీ-డబ్స్ లో పెద్ద పార్టీ ఇచ్చాడు. బన్నీ హోమ్ బ్యానర్ అయిన జీఎ2 పిక్చర్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అనే సంగతి తెలిసిందే కదా. పైగా ఈ సినిమా నిర్మాత ఎస్కేయన్ అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్. గతంలో అల్లు అర్జున్ కు పీఆర్ ఓ గా కూడా పనిచేశాడాయన. ఈ సినిమా తో ఎస్కేయన్ మంచి హిట్ సాధించడంతో బన్నీ చాలా సంతోషంగా ఉన్నాడట.

బన్నీ ఇలా యువ టాలెంట్ ను ప్రశంసించడం మొదటి సారేమీ కాదు. గతంలో 'పెళ్లి చూపులు'.. 'మహానటి' టీమ్స్ కు పార్టీ ఇచ్చాడు. రీసెంట్ గా 'గీత గోవిందం' టీమ్ కూడా బన్నీ నుండి పార్టీ అందుకుంది. ఇప్పుడు అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ 'టాక్సీవాలా' టీమ్ మెంబర్స్ కు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ లో 'టాక్సీవాలా' టీం ఫుల్ గా ఎంజాయ్ చేశారట. 'టాక్సీవాలా' టీమ్ మాత్రమే కాకుండా ఇతర టాలెంటెడ్ యువదర్శకులను కూడా బన్నీ ఈ భారీ పార్టీ కి ఆహ్వానించాడట.

అల్లు అర్జున్ లాంటి స్టార్ నుండి ప్రశంసలు అందుకోవడం.. యంగ్ టాలెంట్ కు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తమ బ్యానర్ అని మాత్రమే కాకుండా కొత్త వారు ఎవరు విజయం సాధించినా ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు బన్నీకి అందరినుండి ప్రశంసలు అందుతున్నాయి.