Begin typing your search above and press return to search.
చిన్న సినిమా సంచలనం
By: Tupaki Desk | 19 July 2016 9:00 PM ISTతస్కర పేరుతో కొన్ని నెలల కిందట తెలుగులో ఓ చిన్న సినిమా విడుదలైన సంగతి చాలా మందికి తెలియదు. సరైన ప్రచారం లేకపోవడం వల్ల.. చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా జనాల్లోకి వెళ్లలేదు. నిజానికి ఇది మంచి సినిమా. కొత్త తరహా ప్రయత్నం. తెలుగులో చాలా అరుదు అనదగ్గ నియో-నాయర్ తరహా సైబర్ హీస్ట్ థ్రిల్లర్. ఆర్బీఐ సిస్టంను హ్యాక్ చేసి.. వేల కోట్లను కొల్లగొట్టే దొంగల కథతో ఈ సినిమా తెరకెక్కింది. చూసిన వాళ్లందరూ ఇది మంచి థ్రిల్లర్ అన్నారు. కానీ జనాలకు ఈ సినిమా గురించి తెలిసేసరికే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది.
ఐతే ఆ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ చిత్రానికి 4 లక్షల వ్యూస్ రావడం విశేషం. వోల్గా సంస్థ ‘తస్కర’ డీవీడీలు కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడీ సినిమాను కామిక్ నావల్ రూపంలోకి మారుస్తుండటం విశేషం. ఫెనిల్ కామిక్స్ అనే పబ్లిషింగ్ హౌజ్ ‘తస్కర’ను గ్రాఫిక్స్ కామిక్ నావెల్ గా మార్చింది. జనాల్లో మంచి ఆదరణ పొందిన సినిమాల్ని ఇలా గ్రాఫిక్స్ నావల్ గా మార్చడం హాలీవుడ్లో మామూలే. అమెరికాతో పాటు యూకేలోనూ ఇలా చేస్తుంటారు. ఇండియాలో ఇవి అరుదు. క్రిష్.. బాహుబలి లాంటి సినిమాలకు ఇలా చేశారు. చిన్న సినిమాల్లో అయితే ఇలాంటి ఘనత ‘తస్కర’కే దక్కింది. కిరీటి.. సంపత్ రాజు.. శ్రీనివాస్ గోవింద్.. మోనిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కిరీటి రాంభట్ల రచన అందించగా.. చంద్రశేఖర్ దేవరపల్లి దర్శకత్వం వహించాడు.