Begin typing your search above and press return to search.

ఎన్నేళ్ళు బాసూ.. త్వరగా రా!!

By:  Tupaki Desk   |   8 Jan 2018 11:17 AM IST
ఎన్నేళ్ళు బాసూ.. త్వరగా రా!!
X
టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిన్న తనం నుంచే నటనలో ఆరితేరిన తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాకా స్టార్ నటీనటులతో పోటీ పడేవాడు. మంచి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే కథల లోపం వల్లనో లేక ఇతర కారణాల వల్లనో తెలియదు గాని మొత్తానికి ఫెడ్ అవుట్ అయిపోయాడు. అయినా గాని తరుణ్ సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు ఆపలేదు.

ఇప్పటికి మంచి హిట్స్ అందుకోవచ్చు అని ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త కథలతో మళ్లీ ప్రేక్షకులను కొత్తగా మెప్పించాలని చూస్తున్నాడు. అయితే తరుణ్ 2013లో ఒక కన్నడ హిట్ కథను తెలుగులో రీమేక్ చేయాలనీ అనుకున్నాడు. మొదట కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ తరువాత మొత్తానికి సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయలేదు. కానీ ఇది నా లవ్ స్టోరీ అని టైటిల్ ని మాత్రం ఎనౌన్స్ చేశారు. పాటలను కూడా రిలీజ్ చేశారు.

అయితే ఇప్పటివరకు ఆ సినిమా రిలీజ్ కాలేదు. మరి ఏమయ్యిందో తెలియదు గాని మొత్తానికి తరుణ్ ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అందుకు సంబందించిన పోస్టర్ ని కూడా మనోడు ఇటీవల రిలీజ్ చేశాడు. ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేసి ఫిబ్రవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన పనుల్లో తరుణ్ చాలా బిజీగా ఉన్నాడు. అయినా ఒక సినిమాతో ఎన్నాళ్ళు తరుణ్.. ఇది రిలీజ్ చేసి త్వరగా ఇంకో సినిమాతో రావయ్యా!!