Begin typing your search above and press return to search.

వెంకటేష్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ తరుణ్.. నిజమేనా..?

By:  Tupaki Desk   |   30 March 2020 11:00 PM IST
వెంకటేష్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ తరుణ్.. నిజమేనా..?
X
విక్టరీ వెంకటేష్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసిన హీరో. 30యేళ్ల సినీ చరిత్ర కలిగిన ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి, ఎందరో గొప్ప దర్శకులతో కలిసి పనిచేసారు. ఇన్నేళ్లు సినీ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సహజమైన నటనతో ఎలాంటి వారి మనసునైనా గెలిచే సత్తా ఉన్న హీరో వెంకటేష్ మాత్రమే. ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు పోతుంటారు. కానీ విక్టరీ వెంకటేష్ ఇప్పటికి హీరోగానే కొనసాగుతున్నారంటే ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేష్..

గత కొంతకాలం వరకు స్పీడ్ తగ్గించిన ఆయన వెంకీమామ సినిమా విజయంతో జోరు పెంచారు. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ - తెలుగు నారప్పలో నటిస్తున్న వెంకటేష్ తదుపరి చిత్రం గురించి కోతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలో నటిస్తాడని. అయితే గతంలో కూడా వెంకటేష్ తరుణ్ తో సినిమా ఉంటుందని చెప్పడం జరిగింది. అప్పటినుండి తరుణ్ కూడా స్క్రిప్ట్ పకడ్బందీగా తయారుచేసే పనిలో పడ్డాడు. తరుణ్ చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందట. స్పోర్ట్స్ డ్రామా చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. మరి అసురన్ తర్వాత వెంకటేష్ ఇదే చిత్రంలో నటించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.