Begin typing your search above and press return to search.

పెళ్ళిచూపులు కుర్రాడు షురూ చేశాడు

By:  Tupaki Desk   |   23 Oct 2017 7:12 AM GMT
పెళ్ళిచూపులు కుర్రాడు షురూ చేశాడు
X
2016 లో విజయ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఎంతటి ఘాన విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దెబ్బకి విజయ్ ఇమేజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఇతర భాషల్లో కూడా రీమేక్ అవ్వడానికి రెడీ అయ్యింది. బాలీవుడ్ రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

అయితే చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ కి కూడా పెళ్లి చూపులు సినిమా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. కానీ తన రెండవ సినిమాను సెట్స్ పైకి తేవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఫైనల్ గా తరుణ్ భాస్కర్ తన నెక్స్ట్ సినిమాను సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఈ రోజు మొదలు పెట్టనున్నాడు. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా స్టార్ట్ అవ్వనున్నట్లు టాక్. పూర్తిగా కొత్త వారితో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

నిర్మాత సురేష్ బాబు పెళ్లి చూపులు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి లాభాలను అందించడంతో తరుణ్ భాస్కర్ కి అవకాశం ఇచ్చారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ఈరోజు స్టార్ట్ చేసి 45 రోజుల్లో షూటింగ్ ని ఫినిష్ చేసేందుకు చిత్ర దర్శకుడు ప్రయత్నిస్తున్నాడట.