Begin typing your search above and press return to search.

బాగా కాన్ఫిడెంటుగా చెప్పేస్తున్నాడే

By:  Tupaki Desk   |   20 Jun 2018 10:12 AM IST
బాగా కాన్ఫిడెంటుగా చెప్పేస్తున్నాడే
X
మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే సాలిడ్ హిట్ కొట్టడమే కాదు.. విషయం ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు హీరోగా గుర్తింపు వచ్చింది. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన పెళ్లిచూపులు సినిమా నచ్చడంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను కొని రిలీజ్ చేసింది.

తరుణ్ భాస్కర్ టాలెంట్ నచ్చడంతో తరవాత సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తీయాలని ప్రొడ్యూసర్ సురేష్ ఆఫర్ కూడా ఇచ్చేశారు. కాస్త గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది టైటిల్ తో నెక్స్ట్ ఫిలిం తీశాడు. తాను షార్ట్ ఫిలింస్ తీసి ఆ గుర్తింపుతో సినిమాల్లోకి వచ్చానని.. వాటిని తీయడంలో ఎదురయ్యే కష్టనష్టాలు తనకు బాగా తెలుసు కాబట్టే అదే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశానంటూ తరుణ్ భాస్కర్ చెబుతున్నాడు. ఇంతవరకు ఈ సబ్జెక్టు ఎవరూ డీల్ చేయలేకపోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నాడు. ఈ సినిమాకు రాసిన ఫస్ట్ డ్రాఫ్ట్ కే ప్రొడ్యూసర్ సురేష్ ఓకే చేశారని చెప్పుకొచ్చాడు.

ఈ నగరానికి ఏమైంది సినిమా యువతపై మరింత ఫోకస్ తో తీశామంటున్నాడు తరుణ్ భాస్కర్. ఇందులో కొత్తదనం ఏదో ఉంటుందని చెప్పడం లేదని.. మన లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నాడు. ఇక్కడ ఎవరి జీవితమూ ఇంకోళ్లలా ఉండదు. జీవితం ఎంత యునిక్ గా ఉంటుందో అలాగే ఈ మూవీ ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాడు. ఓ మంచి కథను చెప్పగలిగాం.. అన్ని డిపార్ట్ మెంట్లలో మాగ్జిమం ఎఫర్ట్ పెట్టామని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్.