Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్.. ఓ పనైపోయింది!

By:  Tupaki Desk   |   14 Jan 2023 7:30 AM GMT
తరుణ్ భాస్కర్.. ఓ పనైపోయింది!
X
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో ప్రేక్షుకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. తన మరో సినిమా గురించి ఓ పోస్ట్ చేశారు. కీడా కోలా సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్లు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి ఆయన ఇప్పటి వరకూ ప్రకటించకపోవడం గమనార్హం.

భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయి కృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. విజి సైన్మా పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సరికొత్త క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ తో తీసుకొస్తున్న ఈ కీడా కోలా సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

గతేడాది ఆగష్టులో ప్రారంభం అయిన ఈ సినిమా.. రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజా సజ్జా, నందు, రాజా గౌతమ్ యువ దర్శకులు ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, సందీప్ రాజ్ తదితరులు హాజరు అయ్యారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసిన వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నామని చెబుతున్నారు.

ఇంకా ఇలా ఎన్ని రోజులు వేచి చూసేలా చేస్తారు.. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి సార్ అంటూ అడుగుతున్నారు. కనీసం సినిమాలో హీరో హీరోయిన్లు, నటీ నటులు, సాంకేతిక సిబ్బంధి ఎవరో అయినా చెప్పండంటూ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామని మరికొంత మంది తెలిపారు. ఏది ఏమైనా సినిమా గురించి మరిన్ని అప్ డేట్లు తెలుసుకోవాలంటే మాత్రం ఇంకా కొంత సమయం ఆగాల్సి వచ్చేలా ఉంది. అలాగే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీయబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.