Begin typing your search above and press return to search.

‘పెళ్లిచూపులు’ ద‌ర్శ‌కుడికి బంప‌రాఫ‌ర్‌

By:  Tupaki Desk   |   29 July 2016 5:30 PM GMT
‘పెళ్లిచూపులు’ ద‌ర్శ‌కుడికి బంప‌రాఫ‌ర్‌
X
ఓ చిన్న సినిమా విడుద‌ల‌కు ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించింది. మీడియా వాళ్ల‌నూ మురిపించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అని విడుద‌ల‌కు ముందే అంద‌రూ ఏకాభిప్రాయం వ్య‌క్తం చేసేంత‌గా పాజిటివ్ బ‌జ్ తెచ్చుకుంది.ఆ సినిమానే ‘పెళ్లిచూపులు’. విడుద‌ల‌కు ముందున్న బ‌జ్ కు త‌గ్గ‌ట్లుగానే ఈ సినిమాకు చాలా మంచి టాక్ వ‌చ్చింది ఇవాళ‌. ఈ సినిమాతోనే త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. త‌న తొలి సినిమా రిలీజైన తొలి రోజే అత‌ను ఓ మంచి అవ‌కాశాన్ని ప‌ట్టేశాడు. త‌న రెండో సినిమాలో స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు త‌రుణ్ భాస్క‌ర్.

‘పెళ్లిచూపులు’ సినిమా క‌థ ముందు విన్న‌ది వెంకీ అన్న‌య్య సురేష్ బాబే అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌నే త‌రుణ్ ను రాజ్ కందుకూరికి ప‌రిచ‌యం చేశాడు. ‘పెళ్లిచూపులు’ ప‌ట్టాలెక్క‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత సినిమాకు అన్ని ర‌కాలుగా అండ‌గా నిలిచి.. పాజిటివ్ బ‌జ్ రావ‌డానికి కూడా తోడ్పాటు అందించారు. త‌రుణ్ టాలెంటేంటో ముందే ప‌సిగ‌ట్టిన సురేష్‌.. అత‌డి త‌ర్వాతి సినిమాను త‌నే నిర్మించ‌డానికి కూడా ముందుకొచ్చాడు. త‌రుణ్ కూడా ఈ విష‌యాన్ని క‌న్ఫ‌మ్ చేశాడు. ఐతే హీరో ఎవ‌ర‌నే విష‌యంలో సందిగ్ధ‌త ఉండ‌గా.. ఇవాళ పెళ్లిచూపులు విడుద‌ల సంద‌ర్భంగా ఆ విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. వెంకీతోనే త‌రుణ్ సినిమా అని ద‌గ్గుబాటి కాంపౌండ్ నుంచి స‌మాచారం వ‌చ్చేసింది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.