Begin typing your search above and press return to search.
కొత్తవారితో లాంగ్ జర్నీ అంటా
By: Tupaki Desk | 23 Dec 2017 4:52 PM ISTగత ఏడాది వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. నిర్మాతలకు పంపిణి దారులకు మంచి లాభాలను ఇవ్వడమే కాకుండా నటించిన తారాగణానికి తెరవెనుక కష్టపడ్డా టెక్నీషియన్స్ కి కూడా ఆ సినిమా ఆఫర్స్ ని అందించేలా చేసింది. జాతీయ అవార్డు కూడా అందుకుంది. ప్రత్యేకంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ని ప్రతి ఒక్కరు అభినందించారు.
అంతే కాకుండా దర్శకుడికి మరికొంత మంది నిర్మాతలు భారీ ఆఫర్స్ ను కూడా ఇచ్చారు. కానీ మనోడు మాత్రం కేవలం సురేష్ ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేస్తానని మాట ఇచ్చేశాడు. అనుకున్నట్టుగానే వారితో సినిమా చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం సినిమా మొత్తం లాంగ్ జర్నీ నేపథ్యంలో రొమాంటిక్ గా సాగుతుందట. పూర్తిగా కొత్త వారే కనిపించనున్నారట. జర్నీలో కొంత మంది స్నేహితులు తాము ఏంటనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే సినిమా అసలు కథట. దాదాపు ఏడాది పాటు దర్శకుడు ఆ కథను రాశాడు.
అయితే టాలీవుడ్ లో లాంగ్ జర్నీ కథలు ప్రేక్షకులకు అంతగా నచ్చవు. ఎప్పుడో క్రిష్ తీసిన గమ్యం సినిమా తప్పితే మారే సినిమా ఆ కాన్సెప్ట్ తో వచ్చి హిట్టు కొట్టలేదు. నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో అదే లైన్ లో వచ్చి రెండు రోజులకే మాయమైంది. ఆ తరహాలో చాలా సినిమాలు బోల్తా కొట్టాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం లాంగ్ జర్నీ కాన్సెప్ట్ లు బలే క్లిక్ అయ్యాయి. మరి పెళ్లి చూపులు దర్శకుడు ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
