Begin typing your search above and press return to search.

పెళ్లి చూపులు దర్శకుడి కొత్త ప్రయోగం

By:  Tupaki Desk   |   11 Jan 2018 5:01 AM GMT
పెళ్లి చూపులు దర్శకుడి కొత్త ప్రయోగం
X
పెళ్లి చూపులు సినిమాతో ఎవరు ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు రెండవ సినిమాను రిలీజ్ చేయడానికి టైమ్ చాలానే తీసుకుంటున్నాడు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఇటీవల ఒక సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతోందని టాక్.

అయితే ఈ సినిమాను కూడా తరుణ్ డిఫెరెంట్ గా తెరకెక్కించనున్నాడట. రీసెంట్ గా ఒక వెరైటీ టైటిల్ కానీ కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ రోజుల్లో మొదట ఎలాంటి ప్రకటన వస్తుందో అందరికి తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ వినబడుతుంది. అయితే తరుణ్ కూడా అదే లైన్ ని టైటిల్ గా సెట్ చేసినట్లు టాక్. న్యూ ఏజిడ్ కథగా ఉంటుందని చిత్ర యూనిట్ కూడా చెబుతోంది.

ఇక హీరోయిన్ గా అనిషా ఆంబ్రోసే కనిపించనుండగా వెళ్లిపోమాకే ఫెమ్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు దర్శకుడు వర్క్ షాప్ కూడా చేశాడు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేసే విధంగా తరుణ్ ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. మరి సెకండ్ సినిమాతో తరుణ్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.