Begin typing your search above and press return to search.

ఖైదీ విలన్ కి భలే ఆఫర్స్ గురూ

By:  Tupaki Desk   |   14 Jan 2017 10:31 AM IST
ఖైదీ విలన్ కి భలే ఆఫర్స్ గురూ
X
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో ఒక్క సీన్ లో అయినా కనిపించాలని.. చాలామంది నటులు ఎంతగా ఆత్రపడ్డారో చూశాం.. విన్నాం. మరి ఆ మూవీలో చిరంజీవికి విలన్ గా నటించిన ఆర్టిస్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి క్రేజ్ ఏర్పడుతుంది? చిరుకి ఎదురొడ్డి నిలిచిన పాత్రలో నటించిన తరుణ్ అరోరాను.. టాలీవుడ్ ఇప్పుడు అక్కున చేర్చుకునేందుకు రెడీ అయిపోయింది.

ఖైదీ నంబర్ 150లో కార్పొరేట్ పాలిటిక్స్ ని ప్లే చేసే విలన్ గా తరుణ్ అరోరా నటించాడు. తమిళ కత్తిలో ఈ పాత్రను నీల్ నితిన్ ముకేష్ బాగా పండించాడు కాని.. తెలుగులో మాత్రం మనోడు యావరేజ్ గానే మెప్పించాడు. కాని తెలుగు ఇండస్ర్టీలో ఈ మాజీ హీరోయిన్ అంజలా జవేరీ భర్తకు ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తరుణ్ అరోరాను పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడులో విలన్ గా ఫైనలైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా సైన్ చేశాడు ఈ మెగా విలన్.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న హై బడ్జెట్ మూవీలో తరుణ్ అరోరాను విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా పలు భారీ ప్రాజెక్టుల కోసం ఆఫర్లు వస్తున్నాయట. మెగాస్టార్ తో ఒక్క సినిమాలో విలన్ గా నటిస్తే.. ఇండస్ట్రీ రియాక్షన్ ఇలా ఉంటుంది మరి!