Begin typing your search above and press return to search.

తార‌క్ వ‌ర్సెస్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రికో ఓటేస్తుందో..?

By:  Tupaki Desk   |   2 Feb 2022 5:45 AM GMT
తార‌క్ వ‌ర్సెస్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రికో ఓటేస్తుందో..?
X
ఇటీవ‌లె రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్‌లు క‌లిసి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

మ‌రికొద్ది రోజుల్లోనే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌ను హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అలియా భ‌ట్‌తో పాటు ఇందులో మ‌రో హీరోయిన్ కూడా ఉంటుంద‌ట‌. ఆ పాత్ర కోసం మేక‌ర్స్ ప్ర‌స్తుతం శ్రీదేవి కూతురు, బాలీవుడ్ స్టార్‌ జాన్వీ క‌పూర్‌ను సంప్ర‌దిస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు జాన్వీ క‌పూర్ కోసం తార‌క్‌కు పోటీగా విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా దిగాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `లైగ‌ర్‌` మూవీ చేస్తున్న విజ‌య్.. ఆపై ఆయ‌న‌తోనే మ‌రో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. అదే `జనగణమన`. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జనగణమన`ను మొద‌ట మ‌హేష్ బాబు, ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో చేయాల‌నుకున్నాడు. కానీ, వారిద్ద‌రూ ఈ మూవీని రిజెక్ట్ చేశారు.

కానీ, ఇప్పుడు అదే చిత్రానికి విజ‌య్ దేవ‌ర‌కొండ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేకాదు, ఈ చిత్రం త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని.. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్‌ను తీసుకోబోతున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. జాన్వీ తార‌క్‌, విజ‌య్‌ల‌లో ఒక్క‌రికే ఓటేస్తుందా..? లేక ఇద్ద‌రికీ ఓకే చెప్పేస్తుందా..? అన్న‌ది చూడాలి.