Begin typing your search above and press return to search.

త‌మిళ స్టార్ల‌ను స‌ర్ అంటూ గౌర‌వించిన తార‌క్

By:  Tupaki Desk   |   11 Dec 2021 12:05 PM IST
త‌మిళ స్టార్ల‌ను స‌ర్ అంటూ గౌర‌వించిన తార‌క్
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ ప్ర‌చారాన్ని ఫుల్ స్వింగ్ లో సాగిస్తున్నారు. నిన్న చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆర్‌.ఆర్‌.ఆర్ ని చురుగ్గా ప్రమోట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత సినిమా అసాధార‌ణ‌ వృద్ధిని సాధించింద‌ని అన్నారు. దీనికి కార‌ణం జ‌క్క‌న్న అంటూ పొగిడేశారు.

``బాహుబలికి ధన్యవాదాలు.. ప్రాంతీయ సినిమా అడ్డంకులు ఇటీవ‌ల‌ తొలగిపోతున్నాయి. విజయ్ స‌ర్ న‌టించిన‌ `మాస్టర్` రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా అద్భుతాలు సృష్టించిందో చూశాం. ధనుష్ సర్ సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నాయి.

ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారనేది స్పష్టమైన సంకేతం..`` అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. విజ‌య్.. ధ‌నుష్ ల‌ను స‌ర్ అంటూ గౌర‌వించిన తార‌క్ వ్య‌క్తిత్వం త‌మిళ తంబీల‌కు అర్థ‌మైంది ఈ వేదిక సాక్షిగా.

RRRలో తమ పాత్రలకు తాము త‌మిళ‌ డబ్బింగ్ చెప్పుకున్నామ‌ని తార‌క్ గురించి త‌న గురించి చ‌ర‌ణ్ తెలిపారు. తార‌క్.. చ‌ర‌ణ్ స్వ‌చ్ఛ‌మైన‌ మాట‌ల‌తో.. త‌మ‌దైన డౌన్ టు ఎర్త్ స్వ‌భావంతో త‌మిళ తంబీల‌ను ఆక‌ట్టుకున్నారు.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు గా .. బ్రిటీష్ పోలీస్ గా డ‌బుల్ షేడ్స్ లో చ‌ర‌ణ్ క‌నిపించ‌నుండ‌గా.. కొమ‌రం భీమ్ గా .. ముస్లిమ్ యువ‌కుడిగా తార‌క్ రెండు డిఫ‌రెంట్ గెట‌ప్పుల్లో కనిపిస్తున్నారు. పులిని వేటాడే యువ‌కుడిగా తార‌క్ పోరాటం ట్రైల‌ర్ లో హైలైట్ అయిన సంగ‌తి తెలిసిందే.