Begin typing your search above and press return to search.

నారా రోహిత్ విలన్ తారకరత్న

By:  Tupaki Desk   |   10 Nov 2015 4:31 AM GMT
నారా రోహిత్ విలన్ తారకరత్న
X
హీరోగా అరంగేట్రం చేస్తూ ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలుపెట్టిన ఘనత నందమూరి తారకరత్నది. అప్పట్లో ఆ హంగామా అంతా చూసి టాలీవుడ్ లోకి ఓ ధ్రువతార వస్తోందని అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఆ తార ఏమైందో అందరికీ తెలిసిందే. దశాబ్దంన్నరగా పరిశ్రమలో ఉన్నా నందమూరి కుర్రాడికి ఇప్పటిదాకా హిట్టు అన్నది లేదు. ఇప్పుడతడి సినిమా రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు పట్టట్లేదు.

ఐతే అరంగేట్ర సినిమా తర్వాత ఇన్నేళ్ల కెరీర్ లో తారకరత్న నిజంగా ప్రేక్షకుల్ని ఆకర్షించిందంటే.. ‘అమరావతి’ సినిమాలో పోషించిన విలన్ పాత్రతోనే. ఆ పాత్రకు అతను నంది అవార్డు సైతం అందుకోవడం విశేషం. మళ్లీ ఇప్పుడు మరోసారి అతను విలన్ పాత్ర పోషించబోతుండటం విశేషం.

నందమూరి కుటుంబానికి బంధువైన నారా వారబ్బాయి రోహిత్ సినిమాలో తారకరత్న విలన్ గా చేయబోతుండటం విశేషం. ప్రదీప్ అనే యువ దర్శకుడు రోహిత్ హీరోగా తెరకెక్కించబోయే ‘రాజా చేయి వేస్తే’ అనే సినిమాలో అనే సినిమాలో తారకరత్న విలన్ గా నటించబోతున్నాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి చలనచిత్రం’ నిర్మిస్తుండటం విశేషం. ఈ సంస్థ రోహిత్ హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో సినిమా కూడా చేస్తోంది.