Begin typing your search above and press return to search.

చరణ్ సినిమాలో నందమూరి విలన్

By:  Tupaki Desk   |   30 Dec 2017 11:30 PM IST
చరణ్ సినిమాలో నందమూరి విలన్
X
నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం టాప్ బాక్స్ ఆఫీస్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఉన్నాడని చెప్పాలి. బాలకృష్ణ 100 సినిమాలు తీసి మంచి గుర్తింపును అందుకున్నాడు గాని తారక్ స్థాయిలో ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోలేకపోతున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ పరవాలేదు అనిపించే విధంగా అలా అలా హిట్స్ అందుకుంటూ వెళుతున్నాడు. ఇక ఆ విషయాన్ని పక్కనపెడితే.. ఆ ఫ్యామిలీలో ఎన్టీఆర్ తో పాటు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మరో హీరో ఉన్నాడు.

అతనే తారకరత్న. ఈ హీరో పలు సినిమాలను చేసినా కూడా అంతగా హిట్స్ అందుకోలేదు. కానీ విలన్ గా మాత్రం కొన్ని ప్రశంసలను అందుకున్నాడు. ముఖ్యంగా అమరావతి సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఆ స్థాయిలో మెప్పించలేదు. పెద్దగా అవకాశాలను కూడా అందుకోలేదు. అయితే ఇప్పుడు మెగా హీరోతో తలపడటానికి ఫిక్స్ అయ్యాడట.త్వరలో బోయపాటి తో రామ్ చరణ్ కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో బోయపాటి తారకరత్న ని సెలెక్ట్ చేసుకున్నాడట. బోయపాటి సినిమాలో విలన్ ఎంత క్రూరంగా ఉంటాడో తెలిసిందే. జగపతిని అలాగే ఆది పినిశెట్టిని తనదైన శైలిలో చూపించి బోయపాటి తన ఐడియా బెస్ట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో నందమూరి తారకరత్న ని విలన్ గా చూపించడానికి కొత్త ప్లాన్ వేశాడు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.