Begin typing your search above and press return to search.

బాధ్యతలు మోస్తున్న ఒకే ఒక్కడు

By:  Tupaki Desk   |   4 March 2016 5:43 PM GMT
బాధ్యతలు మోస్తున్న ఒకే ఒక్కడు
X
నందమూరి నారా కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. రాజా చెయ్యి వేస్తే చిత్రంలో నారా రోహిత్ హీరోగాను, తారకరత్న విలన్ గాను యాక్ట్ చేస్తున్నారు. వరుసకు బావా బావమరుదులైన వీరిద్దరు ఒకే సినిమాలో నటిస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ కు.. తారకరత్న కూడా హాజరయ్యాడు.

'పౌరుషానికి ప్రాణం పెట్టే బాలయ్య అభిమానులు' అంటూ స్పీచ్ మొదలుపెట్టిన తారకరత్న.. డైరెక్టర్ పవన్ బావ, హీరో రోహిత్ బావ అంటూ వరసలు కలిపి మాట్లాడ్డంతో అందరూ కనెక్ట్ అయిపోయారు. ఈ సమయంలో ఇంతగా కష్టపడే హీరోని బావనే చూస్తున్నానని.. ఒకే రోజు రెండేసి షిఫ్టుల్లో పని చేస్తూ చాలా కష్టపడుతున్నాడని నారా రోహిత్ ని అభినందించాడు తారకరత్న.

'చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాం, మాకు తెలిసిన ఒకే ఒక హీరో బాలయ్య. మాకు గాడ్ ఫాదర్, మా దైవం బాలయ్య చేతుల మీదుగా ఈ ఆడియో లాంఛ్ కావడం ఆనందంగా ఉంది. మా కుటుంబం నుంచి ఎంతోమంది వచ్చి, నందమూరి అని చెప్పుకుంటున్నాం. కానీ తాతగారి తర్వాత.. ఆయన ఇచ్చిన బరువు బాధ్యతలు భుజాన వేసుకుని తిరుగుతున్న ఒక్కే ఒక్కరు బాలయ్య బాబాయ్' అన్న తారకరత్న.. జై బాలయ్య - జైజై బాలయ్య అంటూ అభిమానులను హుషారెత్తించారు.

ఇదిలా ఉంటే.. ఆ తర్వాత మాట్లాడిన బాలయ్య కూడా.. తారకరత్న విభిన్నమైన రోల్స్ చేస్తున్నాడని, త్వరలో వినూత్న కాంబినేషన్స్ చూడబోతున్నారంటూ.. తన వందో సినిమాకి సంబంధించిన క్లూ ఒకటి ఇచ్చారు.