Begin typing your search above and press return to search.

తారకరత్న కొత్త అవతారం

By:  Tupaki Desk   |   14 Dec 2015 7:30 AM GMT
తారకరత్న కొత్త అవతారం
X
టాలీవుడ్ లో నందమూరి తారకరత్న ఒక సంచలనం అని చెప్పాలి. అరంగేట్రం నుంచి ఇప్పటివరకూ రకరకాల కేరక్టర్లతో దూసుకుపోతున్నాడు. అసలు నందమూరి వంశంలో విలన్ కేరక్టర్ యాక్సెప్ట్ చేసిన ఘనత తారకరత్న ఒకడికే దక్కుతుంది. గతంలో అమరావతి అనే మూవీలో విభిన్నమైన కేరక్టర్ తో అలరించిన ఈ నందమూరి హీరో కెరీర్.. తర్వాత బాగా స్లో అయింది. మళ్లీ చాలా రోజుల తర్వాత మీడియాలో తారకరత్న పేరు చర్చనీయాంశమైంది.

దీనికి కారణం నారా వారి వారసుడు రోహిత్ హీరోగా చేయబోతున్న సినిమాలో తారకరత్న విలన్ కేరక్టర్ అంగీకరించాడని తెలియడమే. అయితే ఈ విషయంపై ఎప్పుడూ నోరు విప్పలేదు ఈ హీరో. అలాగే యూనిట్ నుంచి కూడా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో నారా రోహిత్ హీరోగా నిర్మాణం కానున్న మూవీలో తారకరత్న విలన్ గా చేస్తాడనే న్యూస్ హాట్ టాపిక్ గా ఉంది. ఈ సమయంలో ఇతగాడి గెటప్.. ఈ న్యూస్ కు కన్ఫామ్ చేసినట్లు అయింది. వారాహి సంస్థ నిర్మించిన "జత కలిసే"చిత్ర ఆడియో ఫంక్షన్ లో నారో రోహిత్ తో పాటు, నందమూరి తారకరత్న కూడా తళుక్కుమన్నాడు. ఈ వేడుకలో బాగా తగ్గించిన జుట్టు, బాగా పెరిగి అక్కడక్కడ గెడ్డంతో కనిపించాడు తారకరత్న. ఈ గెటప్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఏంటీ.. తారకరత్న ఇలా అయిపోయాడని ముందు అందరూ అనుకున్నా.. తర్వాత విలన్ కేరక్టర్ కోసం ఛేంజోవర్ అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక కేరక్టర్ కోసం ఇంతగా మారిపోయాడంటే.. ఈ నందమూరి వారసుడికి ఉన్న కమిట్మెంట్ చూసి నోరెళ్లబెట్టారు. ఒకవేళ ఇలాంటి కేరక్టర్స్ కంటన్యూ చేస్తే మాత్రం... నందమూరి వంశం నుంచి కూడా ఓ సూపర్ విలన్ వచ్చేస్తున్నట్లే.