Begin typing your search above and press return to search.

తారకరత్న మళ్లొస్తున్నాడు

By:  Tupaki Desk   |   18 Aug 2016 7:30 AM GMT
తారకరత్న మళ్లొస్తున్నాడు
X
నందమూరి తారకరత్న పట్టు వదలట్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒకదాని తర్వాత ఇంకో సినిమా విడుదలవుతున్నాయి. చీకట్లో కలిసిపోతున్నాయి. ఈ నెల ఐదో తారీఖున ‘కాకతీయుడు’ అనే సినిమాతో పలకరించాడు తారకరత్న. అది రెండేళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఉన్న సినిమా. ఐదో తారీఖున రిలీజ్ అన్నారు. అసలు విడుదలైందో లేదో కూడా పట్టించుకునే తీరిక జనాలకు లేదు. ఇప్పుడు ‘ఎవరు’ అనే హార్రర్ థ్రిల్లర్ తో వస్తున్నాడు నందమూరి హీరో. రమణసెల్వ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నారట.

‘ఎవరు’ థియేట్రికల్ ట్రైలర్‌ ను నారా రోహిత్ విడుదల చేయడం విశేషం. రోహిత్-తారకరత్న కలిసి ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం హార్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఈ జానర్లో వస్తున్న ‘ఎవరు’ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బాగుంది’’ అని చెప్పాడు. తారకరత్న ఇందులో సైక్రియాట్రిస్ట్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. హీరోగా చేస్తూనే విలన్ రోల్స్ కూడా చేస్తూ నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడీ నందమూరి హీరో. కానీ ఇప్పటిదాకా సక్సెస్ మాత్రం ఖాతాలో పడలేదు. మరి ‘ఎవరు’ అయినా అతడి కోరిక తీరుస్తుందేమో చూద్దాం.