Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హీరోగా.. దేవినేని

By:  Tupaki Desk   |   6 April 2017 7:29 AM GMT
ఎన్టీఆర్ హీరోగా.. దేవినేని
X
అంతన్నాడింతన్నాడే అన్నట్లుగా ‘వంగవీటి’ సినిమా విషయంలో చాలా ముచ్చట్లు చెప్పి.. సినిమా విషయంలో తీవ్రంగా నిరాశ పరిచాడు రామ్ గోపాల్ వర్మ. ప్రేక్షకులకు ఆశించినట్లుగా అయితే ఆ సినిమా లేదన్నది వాస్తవం. చరిత్రను కూడా తనకు నచ్చినట్లు చూపించాడని వర్మపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐతే ఇప్పుడు విజయవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంలో మరో సినిమా తెరమీదకు రాబోతుండటం విశేషం. వర్మ వంగవీటి కుటుంబాన్ని లీడ్ రోల్‌ లో తీసుకుని ‘వంగవీటి’ సినిమా తీస్తే.. ఇప్పుడు వంగవీటి కుటుంబానికి బద్ధ శత్రువులైన దేవినేని ఫ్యామిలీ నేపథ్యంలో సినిమా తెరమీదికి రాబోతోంది. ఆ చిత్రంలో నందమూరి తారక రత్న(ఎన్టీఆర్ ) ప్రధాన పాత్రలో నటించబోతుండటం విశేషం.

శివనాగు అనే దర్శకుడు తారకరత్నను ముఖ్య పాత్రలో పెట్టి ‘దేవినేని’ సినిమా తీయబోతున్నాడు. దీక్షిత ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయిందట. మేలో షూటింగ్ మొదలుపెడతారట. తారకరత్న ఇందులో దేవినేని నెహ్రూ పాత్రలో కనిపిస్తాడట. ఈ కథ అంతా దేవినేని కుటుంబం కోణంలోనే సాగుతుందట. దేవినేని ఫ్యామిలీ చాలా మంచి పనులు చేసిందని.. అవన్నీ సినిమాలో చూపిస్తామని.. వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తామని అంటున్నాడు దర్శకుడు. ఐతే తారకరత్నకు ఏమాత్రం మార్కెట్ లేని నేపథ్యంలో ‘వంగవీటి’ తరహాలో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందా అన్నదే సందేహం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/