Begin typing your search above and press return to search.

క్రేజీగా బుల్లితెర షో కోసం తార‌క్ ప్యాకేజీ ఎంతంటే?

By:  Tupaki Desk   |   10 July 2021 4:00 PM IST
క్రేజీగా బుల్లితెర షో కోసం తార‌క్ ప్యాకేజీ ఎంతంటే?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఠ‌ఫ్ షెడ్యూళ్ల గురించి తెలిసిందే. ఓ వైపు వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. మ‌రోవైపు బుల్లితెర రియాలిటీ షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు? తోనూ అత‌డు అల‌రించ‌నున్నారు. పెద్ద తెర బుల్లితెర రెండుచోట్లా తార‌క్ వేవ్స్ అన్ లిమిటెడ్ గా కొన‌సాగ‌నున్నాయి.

ప్రస్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోని ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక పాట కొన్ని యాక్షన్ సన్నివేశాలు తప్ప మిగిలిన షూట్ పూర్తయింది. వేడుక పాట‌ను చిత్రీకరించడానికి చిత్ర‌ బృందం త్వరలో ఉక్రెయిన్ కు బయలుదేరుతుంది. రాజ‌మౌళి నుంచి రిలీఫ్ రాగానే కోరటాల శివ .. ప్రశాంత్ నీల్ లతో తార‌క్ సినిమాలు చేయాల్సి ఉంది.

ఇటీవ‌ల తార‌క్ కి షెడ్యూళ్లు అనుకూలించ‌క‌ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు? నుంచి త‌ప్పుకున్నార‌ని .. సెకండ్ వేవ్ వ‌ల్ల ఈ షోని కూడా ర‌ద్దు చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇంత‌లోనే వాట‌న్నిటికీ చెక్ పెడుతూ తార‌క్ హోస్టింగుకి రెడీ అవుతుండ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షోని బ్లాక్ బ‌స్ట‌ర్ చేసిన తార‌క్ ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడుతో మ‌రోసారి స‌త్తా చాటాల‌ని భావిస్తున్నాడు.

జూలై 10 నుంచి ఈఎంకే షూటింగ్ ని ప్రారంభించారు. హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మూడు రోజులు పాటు తార‌క్ షూటింగులో పాల్గొన్నార‌ట‌. అర‌వై ఎపిసోడ్ల కోసం నటుడికి 10 కోట్ల రూపాయల ప్యాకేజీని తార‌క్ అందుకుంటున్నార‌ని తెలిసింది. ఇంత‌కుముందు బిగ్ బాస్ షో కోసం తార‌క్ భారీ ప్యాకేజీ అందుకున్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ త‌ర‌హాలోనే ఈఎంకే షోని కూడా తార‌క్ బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తారనే ధీమా వ్య‌క్త‌మ‌వుతోందిట‌.