Begin typing your search above and press return to search.

వర్కౌట్స్‌ మొదలు పెట్టిన తారక్‌ చరణ్‌

By:  Tupaki Desk   |   23 Sept 2020 10:00 AM IST
వర్కౌట్స్‌ మొదలు పెట్టిన తారక్‌ చరణ్‌
X
ఆరు నెలలుగా ఆగిపోయిన షూటింగ్స్‌ మెల్లగా ప్రారంభం అవుతున్నాయి. జూన్‌ నెలలో టీవీ సీరియల్స్‌ షో లు షూటింగ్‌ ప్రారంభం అయ్యాయి. కాని సినిమాలు ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలు మాత్రం ఇన్నాళ్లు పునః ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు ఈ నెల నుండి మీడియం రేంజ్‌ హీరోలు పెద్ద హీరోలు సెట్స్‌ పైకి వెళ్లారు.. వెళ్లబోతున్నారు. ఇక మిగిలి ఉన్న స్టార్స్‌ ప్రాజెక్ట్స్‌ కూడా వచ్చే నెల నుండి లేదా నవంబర్‌ నుండి పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను వచ్చే నెల రెండవ లేదా మూడవ వారం నుండి షూటింగ్‌ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

రెండు వారాల క్రితమే దర్శకుడు రాజమౌళి హీరోలు ఇద్దరికి కూడా అక్టోబర్‌ లో షూటింగ్‌ కు వెళ్దాం.. మునుపటి వెయిట్‌ మరియు ఫిజిక్‌ తో రెడీగా ఉండండి అంటూ చెప్పాడట. లాక్‌ డౌన్‌ లో వర్కౌట్స్‌ విషయంలో కాస్త అలసత్వం చూపించిన హీరోలు ఇద్దరు మళ్లీ ఇప్పుడు కష్టపడుతున్నారు. అక్టోబర్‌ మొదటి వారం వరకు పూర్తి ఫిట్‌ గా జక్కన్న ముందు ఇద్దరు హీరోలు కూడా నిల్చునే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరుగబోతున్న షెడ్యూల్‌ లో ఇద్దరు హీరోలతో పాటు అజయ్‌ దేవగన్‌ మరియు ముఖ్య తారాగణంపై చిత్రీకరణ జరుపబోతున్నారు.

సినిమాను తక్కువ మంది కాస్ట్‌ అండ్‌ క్రూతో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడు. జక్కన్న సినిమా షూటింగ్‌ అంటే వందల మంది ఉంటారు. కాని కరోనా టైం కారణంగా సగంకు పైగా తక్కువగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాను చకచక పూర్తి చేసి వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.