Begin typing your search above and press return to search.

తార‌క్ బ‌ర్త్ డే స్పెష‌ల్ ఓటీటీ డ‌బుల్ ట్రీట్!

By:  Tupaki Desk   |   20 May 2022 7:30 AM GMT
తార‌క్ బ‌ర్త్ డే స్పెష‌ల్ ఓటీటీ డ‌బుల్ ట్రీట్!
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా అభిమానుల‌ విషెస్ తో హోరెత్తిపోతుంది. ఓవైపు టాలీవుడ్ సెల‌బ్రిటీలు..మ‌రోవైపు ఫ్యాన్స్ శుభాకాంక్ష‌ల వెల్లువ‌తో ఒక‌టే హంగామా న‌డుస్తుంది. తార‌క్ 30వ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ తో యంగ్ టైగ‌ర్ అభిమానులకు కొర‌టాల బిగ్ ట్రీట్ ఇచ్చేసారు. ఫ్యాన్స్ అంచ‌నాల్ని మించి మోష‌న్ పోస్ట‌ర్ నెట్టింట దూసుకుపోతుంది.

తాజాగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు కూడా తార‌క్ ని స‌ర్ ప్రైజ్ చేసాయి. ఏకంగా తార‌క్ న‌టించిన సినిమా ఈరోజు నుంచే లైవ్ లోకి వ‌చ్చేలా ప్లాన్ చేసింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా 'ఆర్ ఆర్ ఆర్' రెండు రోజులు ముందుగానే థియేట‌ర్లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'ఆర్ ఆర్ ఆర్' నేటి నుంచి ఓటీటీ స్ర్టీమింగ్ కి రెడీ అయింది.

దీంతో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు మెగా స్టార్ చిరంజీవి..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన 'ఆచార్య' కూడా నేటి నుంచే ఓటీటీ స్ర్టీమింగ్ కి రావ‌డం విశేషం. జీ-5లో 'ఆర్ ఆర్ ఆర్' సౌత్ లో అన్ని భాష‌ల్లో స్ర్టీమింగ్ కానుంది. మ‌రాఠీ..గుజ‌రాతీ..బెంగాలీ భాష‌ల్లో సైతం ఆర్ ఆర్ ఆర్ ఓటీటీ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌నుంది.

వాస్త‌వానికి ఈ చిత్రాన్ని పేప‌ర్ వ్యూ విధానంలో రిలీజ్ చేయాల‌ని ముందుగా భావించారు. కానీ ప్రేక్ష‌కుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. దీంతో జీ-5 టీ వోడ్ మోడ్ ని తొల‌గించింది. సాధార‌ణ చందాదారుల‌కు ఆర్ ఆర్ ఆర్ ని ఉచితంగానే వీక్షించే వెసులుబాటు క‌ల్పించింది. ఇక 'ఆచార్య' కూడా నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ర్టీమింగ్ కావ‌డంతో తార‌క్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ హీరో పుట్టిన రోజు సంద‌ర్బంగా మెగా హీరోలిద్ద‌రు న‌టించిన సినిమా రిలీజ్ చేయ‌డంపై సంబ‌ర‌ప‌డుతున్నారు. దీంతో తార‌క్-చ‌ర‌ణ్ బాండింగ్ ఎంత స్ర్టాగ్ గా ఉందంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. చ‌ర‌ణ్ -తార‌క్ త‌మ బాండింగ్ గురించి ఆర్ ఆర్ ఆర్ ప్ర‌చారం స‌మ‌యంలో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇద్ద‌రు క‌లిసి ఒకే చిత్రంలో ప‌నిచేయ‌డంతో ఒక‌ర్ని ఒక‌రు అర్ధం చేసుకుని స్నేహితులుగా ప్ర‌యాణం మొద‌లు పెట్టి... నేడు ప్రాణ స్నేహితుల‌య్యారు. తెర‌పై ఈ కాంబినేష‌న్ ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు.