Begin typing your search above and press return to search.

థియేటర్‌ లో హీరోయిన్‌ కు వింత అనుభవం

By:  Tupaki Desk   |   16 Jun 2019 6:23 AM GMT
థియేటర్‌ లో హీరోయిన్‌ కు వింత అనుభవం
X
హీరోలు మరియు హీరోయిన్స్‌ తాము నటించిన సినిమాను థియేటర్లలో చూసేందుకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. స్టార్స్‌ అయితే మొహానికి మాస్క్‌ వేసుకుని వెళ్తారు. కొత్త వారు అయితే మామూలుగానే వెళ్తారు. థియేటర్‌ లో ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు స్టార్స్‌ అలా చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు వారికి అలా చూడటం ఆనందంను కలిగించొచ్చు మరి కొన్ని సార్లు సినిమా బాగా లేకుంటే ప్రేక్షకులు చేసే కామెంట్స్‌ తో బాధ కూడా కలుగవచ్చు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ తారా సుతారియాకు వింత అనుభవం ఎదురైంది.

మోడలింగ్‌ రంగంలో మంచి గుర్తింపు దక్కించుకున్న తారా సుతారియా తాజాగా 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' చిత్రంలో హీరోయిన్‌ గా నటించింది. కరణ్‌ జోహార్‌ బ్యానర్‌ లో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రంను ఒక థియేటర్‌ లో చూసేందుకు తారా సుతారియా వెళ్లింది. తారా పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిద్దరు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఆ సమయంలోనే హీరోయిన్‌ గురించి వారు మాట్లాడుకుంటూ చెడ్డగా కామెంట్స్‌ చేశారట. వారిద్దరి పక్కన హీరోయిన్‌ ఉందనే విషయం వారికి తెలియదు. సినిమా పూర్తి అయ్యి లైట్లు వెలిగిన తర్వాత తమ పక్కన ఉన్నది హీరోయిన్‌ అని వారు గమనించారట. ఈ విషయాన్ని స్వయంగా తారా సుతారియా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు ఎదురైన అనుభవంను నిర్మొహమాటంగా ఇంటర్వ్యూలో తారా చెప్పడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది.