Begin typing your search above and press return to search.

అక్క‌డ RX100 జాక్ పాట్ ఎవ‌రికి?

By:  Tupaki Desk   |   6 Aug 2019 3:26 PM GMT
అక్క‌డ RX100 జాక్ పాట్ ఎవ‌రికి?
X
ఒకే ఒక్క RX100 పంజాబీ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ఫేట్ మార్చేసింది. ఇప్పుడు అదే సినిమా హిందీ రీమేక్ వేరొక భామ ఫేట్ కూడా మార్చేయ‌బోతోందా? అంటే అవుననే ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు ఈ రీమేక్ తో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి వార‌సుడు అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నాడు. సునీల్ శెట్టి పుత్ర‌ర‌త్నం అహ‌న్ శెట్టికి ఇది తొలి సినిమా కాబ‌ట్టి దీనిపై ఎన్నో హోప్స్ ఉన్నాయి.

ఎట్ట‌కేల‌కు ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. ఈ రీమేక్ లో తారా సుతారియా క‌థానాయిక‌గా ఎంపికైంది. ఒరిజిన‌ల్ లోని పాయ‌ల్ పాత్ర‌లో అమ్మ‌డు ప‌ర‌కాయం చేస్తుంద‌న్న‌మాట‌. కండ‌లు మెలితిరిగిన కుర్రాడికి ప‌డిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేసి అటుపై పెళ్లంటే దూరం పెట్టే అమ్మాయిగా బాలీవుడ్ స్క్రీన్ ని వేడెక్కించ‌బోతోంది తారా సుతారియా. బాలీవుడ్ అంటే ఇంకాస్త ఎక్కువే మ‌సాలా ద‌ట్టిస్తారు. పెద‌వి ముద్దులు .. వేడెక్కించే బెడ్ రూమ్ స‌న్నివేశాల‌కు కొద‌వేం ఉండ‌దు.

వాస్త‌వానికి తారాకి ఒక ద‌క్షిణాది రీమేక్ లో న‌టించే అవ‌కాశం రావ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంత‌కుముందు `అర్జున్ రెడ్డి` రీమేక్ `క‌బీర్ సింగ్`లో నాయిక‌గా తొలి ఆప్ష‌న్ తారానే. కానీ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` కోసం వ‌దులుకుంద‌ట‌. దుర‌దృష్టం కొద్దీ ఆ సినిమా ఫ్లాప్. క‌బీర్ సింగ్ సెన్సేష‌న‌ల్ హిట్. బాలీవుడ్ టాప్ 10 చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. కార‌ణం ఏదైనా తారాకి జాక్ పాట్ మిస్స‌య్యింది. క‌నీసం అప్పుడు పోగొట్టుకున్నా.. ఇప్పుడు ఆర్.ఎక్స్ 100 రూపంలో అయినా అదృష్టం క‌లిసొస్తుందేమో చూడాలి. ఆ పాత్ర‌లో వేడి ఉంది కాబట్టి.. తెర మీద ఎంత వేడెక్కించ‌గ‌లిగితే అంతా హిట్టొస్తుందేమో!