Begin typing your search above and press return to search.

అప్పుడే చెట్టా ప‌ట్టాల్ అంటూ తిరిగేస్తున్న కొత్త జంట‌

By:  Tupaki Desk   |   31 Oct 2020 10:15 AM IST
అప్పుడే చెట్టా ప‌ట్టాల్ అంటూ తిరిగేస్తున్న కొత్త జంట‌
X
సీకే బ్యూటీ దిశాప‌టానీతో యంగ్ ట్యాలెండ్ టైగ‌ర్ ష్రాఫ్ షికార్ల గురించి తెలిసిన‌దే. లోఫ‌ర్ బ్యూటీతో ల‌వ్వాయ‌ణానికి మ‌మ్మీ అడ్డు చెప్ప‌డంతో టైగ‌ర్ చేసేదేమీ లేక విడిపోయాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఆ త‌ర్వాత అత‌డు సింగిల్ స్టాట‌స్ ని కొన‌సాగిస్తున్నాడా? అంటే.. ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 బ్యూటీ తారా సుతారియాతో షికార్లు చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయ్.

అది నిజ‌మేనా? అనుకునేలా తారా ఇన్ స్టా పోస్టింగులు ప్రూఫ్ గా క‌నిపిస్తుంటే బోయ్స్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. పైగా హీరో పంథి 2 కోసం తారాతో జ‌త‌క‌డుతున్నాడు టైగ‌ర్. దీంతో ఇక ఈ జోడీ షికార్లుకు అడ్డూ ఆపూ ఉండ‌ద‌నే అంచ‌నా వేస్తున్నారు. అస‌లే తారా దూకుడు చూస్తుంటే టైగ‌ర్ నిల‌వ‌గ‌ల‌డా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.

టైగర్ ష్రాఫ్ అభిమాని నేను అంటూ తారా తెగ హ‌డావుడి చేసేస్తుంటే బోయ్స్ కి డౌట్లు పుట్టుకొచ్చేస్తున్నాయ్. బాలీవుడ్ లో హృతిక్ త‌ర్వాత అంత‌టి ట్యాలెంటెడ్ స్టార్ గా ఆవిష్క‌రించుకుంటున్న టైగ‌ర్ కి గాళ్స్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతని తొలి చిత్రం హెరోపంథి క‌చ్చితంగా ప్రత్యేకమైనది. తారా సుతారియాతో హెరోపంథి సీక్వెల్ ను నటించడానికి టైగ‌ర్ ఎగ్జ‌యిట్ అయిపోతున్నాడ‌ట‌. SOTY 2 తర్వాత తారా టైగర్ మళ్లీ తెరపై నిప్పంటించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. 2020 డిసెంబర్ ‌లో షూట్ ను ప్రారంభించనున్నారు.

తాజా నివేదిక ప్రకారం టైగర్ ష్రాఫ్ - తారా డిసెంబరులో 10 దేశాలలో హెరోపంథి 2 చిత్రీకరణను ప్రారంభించటానికి తిరిగి కలుసుకుంటార‌ట‌. లండన్- న్యూయార్క్- మిలన్ - మాస్కోలను చిత్రీకరణ కోసం మేకర్స్ ఇప్పటికే తేదీలు ఖరారు చేసినట్లు తెలిసింది. షూటింగ్ ప్రారంభం కాగానే ఇతర దేశాలను కూడా చేరుస్తార‌ట‌. సీక్వెల్ లో టైగర్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ట‌. కోపంగా ఉన్న త‌న‌ తండ్రి నుండి దూరంగా ఉంటూ.. అంతర్జాతీయ ఏజెన్సీల నుండి తప్పించుకుని బార్న్ త‌ర‌హాలో తిరిగేస్తుంటాడ‌ట‌. హెరోపంథి 1 పాత్ర కు కొన‌సాగింపుగా ఈ రోల్ ఉంటుంద‌ట‌. హీరోపంథి 2 కి అహ్మద్ ఖాన్ ద‌ర్శ‌కుడు కాగా.. సాజిద్ నాడియా వాలా నిర్మిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తారా తన హిందీ రీమేక్ అయిన ఆర్.ఎక్స్ 100 లో అహన్ శెట్టి- సాజిద్ ల‌తో కలిసి పనిచేస్తోది. హీరోపంథి 2 చిత్రం 16 జూలై 2021 న విడుదల కానుందని టీమ్ ప్ర‌క‌టించింది.